అంతర్జాతీయం

భారత మహిళా శాంతిదళం అందరికీ స్ఫూర్తిదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి: లైబీరియాలో భారత్‌కు చెందిన మహిళా శాంతి పరిరక్షక దళం అందరికీ స్ఫూర్తిదాయకమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ ప్రశంసిస్తూ, మహిళలపై లైంగిక దాడులు, వారి అక్రమ రవాణా, వేధింపులులాంటి వాటిని అరికట్టడానికి సమితి చేస్తున్న కృషికి మహిళలు ఎలా తమ వంతు సేవలందించగలరో చెప్పడానికి వారి ప్రవర్తన ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ‘ఎబోలా అంటువ్యాధి ప్రబలిన సమయంతోసహా వారు పని చేసినంతకాలం తమ పనితీరు, ప్రొఫెషనలిజం ద్వారా ఈ సాహస మహిళలు అటు లైబీరియా ప్రభుత్వం, ప్రజల గౌరవాన్ని సంపాదించారు’ అని బాన్ కి-మూన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైబీరియాలో తొమ్మిదేళ్లు పని చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అందరూ మహిళా పోలీసులే ఉండే దళం ఆ దేశంనుంచి తిరిగివెళ్తున్న సందర్భంగా బాన్-కి మూన్ ఈ ప్రకటన చేశారు. 125 మంది మహిళా పోలీసులు, సపోర్టింగ్ సిబ్బంది ఉండే ఈ దళం ఈ వారాంతంలో భారత్‌కు తిరిగి వస్తుంది. భద్రతా మండలి తీర్మానం ప్రకారం 2016 జూన్ 30 నాటికల్లా లైబీరియా భద్రతకు సంబంధించి తన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడంలో ఫార్మ్‌డ్ పోలీసు యూనిట్ (ఎఫ్‌పియు)గా పిలవబడే ఈ దళం సేవలను బాన్ కి-మూన్ తన ప్రకటనలో ప్రశంసించారు. తమ కృషి ద్వారా వారు నేర మనస్తత్వాన్ని తగ్గించడం, మహిళలపై జరిగే లైంగిక దాడులు, హింసను అరికట్టడంతో పాటు అక్కడి ప్రజల్లో భద్రతా భావాన్ని తిరిగి కల్పించగలిగారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన లైబీరియా ప్రజలకు, భావి తరాల మహిళా పోలీసు అధికార్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన దళంలోని మహిళలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.