అంతర్జాతీయం

కుటుంబాన్ని కడతేర్చి.. ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్‌ఫెయిర్ (అమెరికా): తుపాకీ సంస్కృతిని అణువణువునా జీర్ణించుకున్న అమెరికాలో మరో ఘోరం జరిగింది. రూరల్ వాషింగ్టన్ రాష్ట్రంలో ఒక సాయుధుడు ఇంటిలో కాల్పులు జరిపి నలుగురిని హత్య చేశాడు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది చుట్టుముట్టడంతో తనను తాను కాల్చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెల్‌ఫెయిర్ పట్టణానికి సమీపంలో ఈ దారుణం జరిగిందని, కుటుంబ సభ్యులను కాల్చిచంపి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతను అధికారులకు ఫోన్‌చేసి చెప్పాడని మాసన్ కౌంటీ షరీఫ్ చీఫ్ డిప్యూటీ ర్యాన్ స్పర్లింగ్ వివరించారు. కాగా, ఈ దారుణ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక బాలికను ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను కాల్చిచంపిన అనంతరం ఆ సాయుధుడు ఇంటి వెలుపలికి వచ్చి తనకు తాను కాల్చేసుకున్నాడని మాసన్ కౌంటీ షరీఫ్ కాసీ సిల్స్‌బరీ తెలిపారు. అంతకుముందు ‘స్వాత్’ (్భద్రతాదళ) బృందం ఆ ఇంటిలోకి చొరబడటానికి ముందు అధికారులు దాదాపు 3 గంటల పాటు ఆ సాయుధుడితో చర్చలు జరిపారని, ఆ తర్వాత భద్రతా సిబ్బంది ఆ ఇంటిలోకి వెళ్లి చూడగా అక్కడ అందరూ విగతజీవులై పడి ఉన్నారని స్పర్లింగ్ వివరించారు. కాగా, గురువారం రాత్రి ఆ ఇంటి నుంచి కాల్పుల శబ్ధం వినిపించిందని, అయితే శుక్రవారం మాత్రం ఎటువంటి కాల్పులు వినిపించలేదని అక్కడికి సమీపంలో నివసిస్తున్న జాక్ పిగట్ అనే వ్యక్తి తెలిపాడు. నాలుగు పదుల వయసు నిండిన దంపతులు ఆ ఇంటిలో నివసిస్తున్నారని, దాదాపు నాలుగైదేళ్ల క్రితం వారు వివాహం చేసుకున్న వీరికి అంతకుముందే ముగ్గురు సంతానం ఉన్నారని పిగట్ వివరించాడు.