అంతర్జాతీయం

అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబియా: భారత్ అమెరికా ప్రజల ఉద్యోగాలను తన్నుకుపోతోందని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయితే తిరిగి ఆ ఉద్యోగాలను వెనక్కి తీసుకొస్తానని ఆయన దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. అమెరికాలో ‘సూపర్ ట్యూజ్‌డే’కు ముందే ‘ట్రంప్ మానియా’ కనపడుతోంది. ఆదివారం ఇక్కడ స్థానిక విమానాశ్రయం సమీపంలో సుమారు అయిదు వేల మంది ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ భారత్, చైనా, జపాన్, మెక్సికో వంటి దేశాలు కొల్లగొట్టిన అమెరికా ప్రజల ఉద్యోగాలను తిరిగితీసుకురావడం ద్వారా అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దాలనేది తన కల అని చెప్పారు. అమెరికా- మెక్సికో సరిహద్దులో గోడ నిర్మిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆరోగ్య రంగానికి సంబంధించి ఒబామా కేర్‌ను రద్దు చేస్తానని అన్నారు. ట్రంప్ చేసిన ప్రతి వాగ్దానానికి ప్రజలు హర్షద్వానాలతో స్పందించారు. ‘యుఎస్‌ఎ, యుఎస్‌ఎ’, ‘ట్రంప్, ట్రంప్’ అని నినాదాలు ఇచ్చారు. ట్రంప్ మొదటి నుంచీ చైనా, జపాన్, మెక్సికోలు అమెరికా ప్రజల ఉద్యోగాలను కొల్లగొడుతున్నాయని విమర్శిస్తున్నారు. అప్పుడప్పుడు వియత్నాం కూడా తమ ఉద్యోగావకాశాలను ఎగరేసుకుపోతోందని అంటున్నారు. సుమారు 40 నిమిషాల సేపు సాగిన ట్రంప్ ఉపన్యాసానికి ప్రజల నుంచి ఆద్యంతం మంచి స్పందన లభించింది. ట్రంప్ రావడానికి కొన్ని గంటలకు ముందే సభాస్థలం నిండిపోయింది. తాజా ప్రైమరీ ఎన్నికల ప్రకారం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం విషయంలో ట్రంప్ 11 రాష్ట్రాలకు గాను పది రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. ఒక్క టెక్సాస్‌లో మాత్రం ట్రంప్ తన ప్రధాన ప్రత్యర్థి, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. క్రుజ్‌ను అబద్ధాలాడే వ్యక్తిగా విమర్శిస్తున్న ట్రంప్ టెక్సాస్‌లోనూ తానే గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు.