అంతర్జాతీయం

భారత్‌కు త్వరలో పాక్ దర్యాప్తు బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తు జరుపుతున్న పాక్ దర్యాప్తు బృందం త్వరలోనే భారత్ సందర్శించవచ్చని ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు అయిన సర్తాజ్ అజీజ్ చెప్పారు. అంతేకాదు, భారత్-పాకిస్తాన్‌ల మధ్య విదేశీ కార్యదర్శుల స్థాయి చర్చలు త్వరలోనే తిరిగి ప్రారంభమవుతాయన్న ఆశాభావాన్ని సైతం ఆయన వ్యక్తం చేశారు. ‘పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి కారణంగా చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించడానికి కుదిరిన ఒప్పందం భగ్నం కావడం దురదృష్టకరం’ అని అమెరికా-పాకిస్తాన్ వ్యూహాత్మక చర్చల ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ అజీజ్ అన్నారు. దాడి జరిగిన వెంటనే ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధానికి ఫోన్ చేసి దర్యాప్తులో పాకిస్తాన్ పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారని, దీనిపై జాతీయ భద్రతా సలహాదార్లు తరచుగా సంప్రదించుకుంటూ ఉన్నారని కూడా ఆయన చెప్పారు. దీనిపై ఒక కేసును రిజిస్టర్ చేశారని, రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రత్యేక దర్యాప్తు బృందం భారత్ సందర్శిస్తుందని చెప్పారు. అందువల్ల త్వరలోనే విదేశీ కార్యదర్శుల స్థాయి చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని తాము ఆశిస్తున్నామని అజీజ్ చెప్పారు. అమెరికా-పాక్ వ్యూహాత్మక చర్చలకు అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీతో పాటుగా అజీజ్ అధ్యక్షత వహించారు. భారత్‌తో పూర్తిస్థాయి, ఎలాంటి అడ్డంకులు లేని నిరంతర చర్చల ప్రక్రియద్వారా మాత్రమే కాశ్మీర్ సమస్యసహా అన్ని అపరిష్కృత సమస్యలు పరిష్కారమవుతాయని తాము బలంగా నమ్ముతున్నామని ఈ సందర్భంగా అజీజ్ చెప్పారు.