అంతర్జాతీయం

అదిగదిగో భూగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టొరంటో: ఓపక్క గ్రహాంతర జీవుల గురించి ఖగోళవేత్తలు అహర్నిశలు అధ్యయనం చేస్తూ, వాటి ఉనికిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ గ్రహాంతర జీవులే భూగోళాన్ని అన్ని విధాలుగా ఆవాసయోగ్యమైనదిగా ఇప్పటికే గుర్తించాయని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ గ్రహాంతర జీవుల నుంచి ఏ క్షణంలోనైనా భూమికి సంకేతాలు అందే అవకాశం ఉందని, వాటిని ఏ విధంగానూ విస్మరించకుండా అందిపుచ్చుకోవాల్సిన అవసరమూ ఉందని కెనడాలోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ‘మనం గ్రహాంతర జీవులను గుర్తించేందుకు ఎలా ప్రయత్నిస్తున్నామో, ఇవికూడా భూమిమీద ఉండేవారిని గుర్తించేందుకు, సంప్రదించేందుకు ఇదేమార్గంలో ప్రయత్నిస్తూనే ఉన్నాయి’ అని శాస్తవ్రేత్తలు తెలిపారు. మనం గ్రహాంతర జీవులకు సంకేతాలు పంపినట్టుగానే, అవికూడా ఈ భూమిమీద ఉన్న జీవులకు తమ ఉనికిని గురించి సంకేతాలు పంపించి ఉండవచ్చునని వెల్లడించారు. ఖగోళవేత్తలు, శాస్తవ్రేత్తలు ఇప్పటివరకూ భూమికి అనంతమైన దూరంలో ఉన్న గ్రహాలపైన, ఇతర గ్రహాల చంద్రుళ్లపైన దృష్టి సారించారని, ఇదే పద్ధతిలో గ్రహాంతర జీవులు కూడా అధ్యయనాలు జరిపి భూమి ఉనికిని గుర్తించాయని వెల్లడించారు. ఒక గ్రహాన్ని గుర్తించడానికి ప్రధానంగా అనుసరించే మార్గం ఓ నక్షత్ర కాంతిలో స్వల్ప వ్యవధిపాటు వచ్చే శూన్యతేనని చెబుతున్న శాస్తవ్రేత్తలు ఆ విధంగా ఎన్నో గ్రహాలను, వాటిలో నివాస యోగ్యతను నిర్ధారించినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ గ్రహాంతర జీవులు కూడా సూర్యుడి చుట్టూ తిరగడాన్ని బట్టే భూమి ఉనికిని గుర్తించారని ఖగోళ భౌతికవేత్తలు రినేహెల్లర్, రాల్ఫ్ పడ్రిజ్ స్పష్టం చేశారు. ఇతర గ్రహాలను గుర్తించడానికి శాస్తవ్రేత్తలు అనుసరించే మార్గలనే గ్రహాంతర జీవులు కూడా అనుసరిస్తున్నందున వాటినుంచి ఏదో రూపంలో భూమికి సంకేతాలు అందే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే మనం అనుసరించే టెక్నిక్‌లనే గ్రహాంతర జీవులు అనుసరిస్తున్నాయన్నది చెప్పలేమని హెల్లర్ స్పష్టం చేశారు.