అంతర్జాతీయం

మదర్ థెరెసాకు సెయింట్‌హుడ్ పోప్ ఫ్రాన్సిస్ ఆమోదముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటికన్ సిటీ: మదర్ థెరెసాకు సెయింట్‌హుడ్ గుర్తింపును ఇవ్వడానికి పోప్ ఫ్రాన్సిస్ మంగళవారం అధికారికంగా ఆమోదం తెలిపారు. అంతేకాక ఆమెను మత గురువుల జాబితాలో చేర్చడానికి సెప్టెంబర్ 4న అధికారిక తేదీగా నిర్ణయించారు. కోల్‌కతాలో పేదలకోసం తన జీవితంలోని అధిక భాగాన్ని వెచ్చించిన మదర్ థెరెసా మృతిచెందిన 19 ఏళ్ల తర్వాత ఆమెకు సెయింట్‌హుడ్‌ను ప్రదానం చేయాలని వాటికన్ నిర్ణయించడం గమనార్హం. అయితే మత గురువుల జాబితాలో చేర్చే కార్యక్రమం రోమ్‌లో ఏ ప్రదేశంలో జరుగుతుందో వాటికన్‌నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఈ కార్యక్రమం తర్వాత మదర్ థెరెసాను ఖననం చేసిన కోల్‌కతాలో కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం జరుగుతుంది. 1997లో మదర్ థెరెసా తన 87వ ఏట మృతిచెందడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్‌ల ప్రశంసలు అందుకున్న ఆమె 1979లో నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు. మదర్ థెరెసా మరణానంతరం కూడా తన మహిమలను ప్రదర్శించినట్లు వాటికన్ నిపుణులు నిర్ధారించిన తర్వాత ఆమెకు సెయింట్‌హుడ్‌ను ఇవ్వాలని నిర్ణయించారు.