అంతర్జాతీయం

కొత్త శకంలోకి మైన్మార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైపిడా, మార్చి 30: మైన్మార్‌లో కొత్త శకంలోకి ప్రవేశించింది. ఏభై ఏళ్ల సైనిక పాలనకు తెరదించుతూ ఆంగ్‌సాన్ సూకీ నాయకత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారం చేపట్టింది. మైన్మార్ అధ్యక్షుడిగా ఆంగ్‌సాన్ సూకీ మాజీ డ్రైవర్, ఆమెకు అత్యంత సన్నిహితుడు హితిన్ క్యా బుధవారం దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఏప్రిల్ 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. హితిన్ క్యాతో పాటు ఇద్దరు ఉపాధ్యక్షులు నైపిడాలోని పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దాల తరువాత తొలిసారి గత ఏడాది సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే అధ్యక్ష పదవి చేపట్టడానికి ఆమె పౌరసత్వ సమస్య అడ్డంకిగా మారింది. దీంతో తనకు అత్యంత సన్నిహితుడైన హితిన్ క్యాను తెరమీదకు తెచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా, మైన్మార్ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానని ఈ సందర్భంగా హితిన్ క్యా ప్రకటించారు. తన సామర్థం మేరకు బాధ్యతలెరిగి ప్రజలను సేవ చేస్తానని 69 ఏళ్ల కొత్త అధ్యక్షుడు వెల్లడించారు.

చిత్రం... మైన్మార్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న హితిన్ క్యా, ఇద్దరు ఉపాధ్యక్షులు...
కొత్త అధ్యక్షుడు హితిన్ క్యాకు బాధ్యతలు అప్పగిస్తున్న థీన్ సీన్