అంతర్జాతీయం

పాక్‌కు 8 వైపర్ యుద్ధ హెలికాప్టర్ల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 5: అమెరికా పాకిస్తాన్‌కు సుమారు 17 కోట్ల డాలర్ల విలువైన తొమ్మిది ఎహెచ్-1జడ్ వైపర్ యుద్ధ హెలికాప్టర్లను విక్రయించబోతోంది. అమెరికా కాంగ్రెస్‌లోని పలువురు సభ్యులు, భారత్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ పాక్‌కు ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించడానికి ఒబామా ప్రభుత్వం నిర్ణయించిన కొద్ది వారాలకే ఇప్పుడు ఈ హెలికాప్టర్లను విక్రయంచబోతుండడం గమనార్హం. తన విదేశీ మిలిటరీ అమ్మకాల నిధి కింద ఈ హెలికాప్టర్లను తయారు చేసి పాకిస్తాన్‌కు డెలివరీ చేసే కాంట్రాక్ట్‌ను అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ బెల్ హెలికాప్టర్ కంపెనీకి అప్పగించింది. టెక్సాస్‌లోన ఫోర్ట్‌వర్త్, అమరిల్లోలోని ప్లాంట్లలో ఈ హెలికాప్టర్ల తయారీ పని జరుగుతుందని, 2018 సెప్టెంబర్ నాటికల్లా పని పూర్తవుతుందని భావిస్తున్నట్లు రక్షణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. గత ఏప్రిల్‌లో అమెరికా కాంగ్రెస్‌కువిదేశాంగ శాఖ నోటిఫై చేసిన పాకిస్తాన్‌కు జరిపే 95.2 కోట్ల డాలర్ల మిలిటరీ హార్డ్‌వేర్ విక్రయాల్లో భాగంగా జరిపే ఈ అమ్మకంలో హెలకాప్టర్లతో పాటుగా తొమ్మిది ఆక్సిలరీ ఫ్యూల్ కిట్స్‌ను కూడా విక్రయిస్తారు. పాకస్తాన్‌కు 95 కోట్ల డాలర్ల విలువైన మిలిటరీ హార్డ్‌వేర్‌ను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఒబామా ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ 6న విదేశాంగ శాఖ అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేసింది. ప్రతిపాదిత హెలికాప్టర్లు, మిలిటరీ పరకరాల విక్రయంతో దక్షిణాసియాలో ఉగ్రవాదం, తీవ్రవాదాలకు వ్యతిరేకంగా ఆ దేశం జరుపుతున్న కృషికి అవసరమైన సైనికపరమైన సామర్థ్యం లభిస్తుందని రక్షణ సెక్యూరిటీ సహకార ఏజన్సీ గత ఏడాది తెలియజేసింది. అమెరికా మెరైన్ కోర్ కోసం రూపొందించిన ఎహెచ్-1డబ్ల్యు సూపర్ కోబ్రా హెలికాప్టర్ ఆధారంగా రూపొందించిన రెండు ఇంజన్ల యుద్ధ హెలికాప్టరే బెల్ కంపెనీ రూపొందించే ఈ ఎహెచ్-1జడ్ వైపర్ హెలికాప్టర్. కొంతమంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు, భారత్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఒబామా ప్రభుత్వం ఈ ఏడాద ప్రారంభంలో పాకిస్తాన్‌కు 70 కోట్ల డాలర్ల విలువైన ఎనిమది ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించడానికి ఒబామా ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.