అంతర్జాతీయం

ట్రంప్, హిల్లరీలకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిల్‌వాకీ, ఏప్రిల్ 6: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లకు ప్రత్యర్థులు మరోసారి షాక్ ఇచ్చారు. ప్రైమరీల్లో దూసుకుపోతున్న ఇద్దరు అభ్యర్థులూ విస్కాన్సిన్ ప్రైమరీలో ఓటమిపాలు కావటంతో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రేసులో వివాదాస్పద వ్యాఖ్యలతో ఓట్లను కూడగట్టుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఆయన ప్రత్యర్థి టెడ్ క్రజ్ భారీ తేడాతో ఓడించారు. విస్కాన్సిన్ ప్రైమరీలో క్రజ్ 48 శాతం ఓట్లతో గెలవగా, ట్రంప్ కేవలం 34శాతం ఓట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిని కావాలని కలలుగంటున్న డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు కూడా ఈ ప్రైమరీలో అదే పరిస్థితి ఎదురైంది. ఆమె ప్రత్యర్థి బెర్నీ సాండర్స్ 56శాతం ఓట్లతో గెలుపొందారు. క్లింటన్‌కు కేవలం 43శాతం ఓట్లు మాత్రమే లభించాయి. విస్కాన్సిన్‌లో ఓడిపోయినప్పటికీ, డెలిగేట్స్ రేసులో మాత్రం ట్రంప్, హిల్లరీలే ముందంజలో కొనసాగుతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు 740 మంది ప్రతినిధుల మద్దతు ఉండగా క్రజ్ 514మంది మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు. మొత్తం 1237మంది ప్రతినిధుల మద్దతును రిపబ్లికన్ అభ్యర్థి కూడగట్టుకోవలసి ఉంటుంది. మరోవైపు 2383మంది ప్రతినిధుల మద్దతును సంపాదించాల్సిన డెమొక్రాట్ల అభ్యర్థులలో హిల్లరీ క్లింటన్ ప్రస్తుతం 1742 మందితో రేసులో మొదటి స్థానంలో ఉండగా సాండర్స్ 1051 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

వ్యోమింగ్ వర్సిటీలో మాట్లాడుతున్న సాండర్స్