అంతర్జాతీయం

హెచ్-1బి వీసా కోసం 2.36లక్షల దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 13: అమెరికాలో వర్క్‌వీసాల కోసం భారత్ నుంచి అనూహ్యమైన రీతిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏప్రిల్ మొదటి వారంలో కేవలం అయిదు రోజుల వ్యవధిలోనే హెచ్-1బి వీసాల కోసం 2.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా నైపుణ్యం గల ఉద్యోగార్థులకు 2017 జనరల్ కేటగిరీలో ఇచ్చే వర్క్ వీసాల పరిమితి 65వేలు కాగా.. దానికి మూడు రెట్లు ఎక్కువగా దరఖాస్తులు రావటంతో లాటరీ ద్వారా దరఖాస్తులను పరిశీలనార్థం ఎంపిక చేసినట్లు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. ఏప్రిల్ 1నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైందని.. అయిదు రోజుల్లోనే 2.36 దరఖాస్తులు రావటంతో వీటన్నింటినీ కంప్యూటరీకరించి లాటరీ పద్ధతి ద్వారా జనరల్ కేటగిరీలో 65వేల దరఖాస్తులను, అడ్వాన్స్‌డ్ డిగ్రీ మినహాయింపు కేటగిరీలో 20 వేల దరఖాస్తులను ఎంపిక చేసినట్లు ఒక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. ఎంపిక కాని దరఖాస్తులకు సంబంధించిన ఫైలింగ్ ఫీజులను తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది.