ఐడియా

ఆవుపాలతో నిద్రలేమికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి వేళ అప్పుడే పితికిన చల్లటి ఆవుపాలను తాగితే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. వేళకు తగినంతగా నిద్ర పోవాలంటే ఎలాంటి మాత్రలు వేసుకోకుండా ఆవుపాలను తాగితే మంచి ఫలితం కనిపిస్తుందని దక్షిణ కొరియాలోని యుమింగ్ న్యూరోసైన్స్ పరిశోధనా సంస్థకు చెందిన శాస్తవ్రేత్తలు భరోసా ఇస్తున్నారు. రాత్రిపూట పితికిన ఆవుపాలలో ట్రైప్ట్ఫోన్, మెలాటొటిన్ అనే హార్మోన్లు అధికశాతంలో ఉంటాయని, మానసిక ఒత్తిడిని నివారించేందుకు ఇవి దోహద పడతాయని వారు చెబుతున్నారు. పగటిపూట, రాత్రి పూట పితికిన ఆవుపాలను, నీరు, డైజోపామ్‌లను విడివిడిగా తీసుకుని, వాటిని ఎలుకల చేత తాగించి అధ్యయనం చేశారు. రాత్రివేళ తీసిన తాజాపాలను తాగిన ఎలుకలు బాగా నిద్రపోయినట్లు పరిశోధకులు గమనించారు. రాత్రి సమయంలో పాలను తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని, మానసిక ఆందోళనలు సైతం తగ్గుముఖం పడతాయని వారు అంటున్నారు. సహజ సిద్ధంగా నిద్ర పోవాలంటే మాత్రల వల్ల సాధ్యం కాదని, ఆవుపాలను తాగడం వల్ల నిద్రలేమికి దూరం కావచ్చని వారు చెబుతున్నారు.