అంతర్జాతీయం

ఇరాక్ స్టేడియంలో పేలిన మానవ బాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిల్లా, మార్చి 26: ఇరాక్‌లో శుక్రవారం రాత్రి ఇస్కందరియా నగరానికి సమీపంలో ఓ ఫుట్‌బాల్ మైదానంలో జనం మధ్యలో మానవ బాంబు పేల్చేసుకోవడంతో కనీసం 41 మంది మృతి చెందగా మరో 105 మంది గాయపడ్డారు. ఇస్కందరియా పట్టణానికి దగ్గర్లోని అల్ అసిరియా గ్రామంలోని చిన్న ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన స్థానిక టోర్నమెంట్ తర్వాత విజేతలకు ట్రోఫీని ప్రదానం చేసే సమయంలో మానవ బాంబు పేల్చేసుకున్నాడని స్థానిక పోలీసు అధికారి చెప్పారు. క్రీడాకారులు, అధికారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానంలో చేరి ఉన్న సమయంలో జనం మధ్యలో మానవ బాంబు పేలడంతో అంతటా భీతావహ పరిస్థితి నెలకొనింది. కాగా, ఇరాక్‌లోని ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ ఈ దాడి తామే జరిపినట్లు ప్రకటించుకుంది. గోల్ పోస్టులతో పాటుగా మైదానమంతా రక్తం మరకలతో, మృత దేహాల భాగాలు చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలను సోషల్ మీడియాలో ఉంచారు. విజేతలకు మేయర్ ట్రోఫీని ప్రదానం చేసే సమయంలో మానవ బాంబు పేల్చేసుకున్నట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. చనిపోయిన వారిలో నగర మేయర్ అహ్మద్ షకేర్ కూడా ఉన్నారు. మేయర్ బాడీగార్డుల్లో ఒకరు, భద్రతా దళానికి చెందిన అయిదుగురు కూడా చనిపోయిన వారిలో ఉన్నారని వారు చెప్పారు. జనంలోకి చొరబడిన తమ యోధుడు పేలుడు పదార్థాలు కట్టి ఉన్న బెల్ట్‌ను పేల్చేసుకోవడంతో జనం ఖండాఖండాలుగా చెల్లాచెదరైనారని ఐఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. దాడికి పాల్పడిన వ్యక్తి పేరును సైఫుల్లా అల్ అన్సారీగా ఆ సంస్థ తెలిపింది. పేలుడులో అరవై మందికి పైగా చనిపోగా, మరో వందమంది గాయపడినట్లు ఐఎస్ ఆ ప్రకటనలో చెప్పుకుంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది టీనేజర్లే ఉన్నారని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.
ఎయిర్ బేస్‌పై దాడి: ముగ్గురు మృతి
ఇరాక్‌లోని అల్-అసద్ ఎయిర్ బేస్‌పై శనివారం ఐఎస్‌కు చెందిన ఆత్మాహుతి బాంబర్ల గ్రూపు దాడిచేయడంతో ముగ్గురు సైనికులు మృతిచెందారు. నలుగురు ఆత్మాహుతి బాంబర్ల అల్-అసద్ ఎయిర్ బేస్‌లో దాడికి పాల్పడ్డారని మేజర్ జనరల్ అలి ఇబ్రాహిద్ దబౌన్ విలేఖరులకు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు సైనికులు మృతిచెందారని, ఆత్మాహుతి దళ సభ్యుల్లో మిగిలిన వారిని భద్రతా దళాలు కాల్చి చంపాయని ఆయన వివరించారు. బాగ్దాద్‌కు దాదాపు 180 కి.మీ దూరంలో అల్-అసద్ ఎయిర్ బేస్ ఉంది. ఇరాక్‌లోని అతి పెద్ద ఎయిర్ బేస్‌లలో ఇది ఒకటి.

చిత్రం బాంబుపేలిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడివున్న వస్తువులు