అంతర్జాతీయం

అణు భద్రతే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 2: అణు భద్రత, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకున్న అనేక కీలక చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అణు స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడంతో పాటు అణు ఉగ్రవాదాన్ని తిప్పి కొట్టే టెక్నాలజీని ఏర్పాటు చేయడం లాంటివి ఈ చర్యల్లో ఉన్నాయి. 50కి పైగా దేశాల నేతలు హాజరయిన అణు భద్రతపై జరుగుతున్న శిఖరాగ్ర సమావేశం రెండో రోజయిన శుక్రవారం నాడు మోదీ ఈ ప్రకటన చేశారు. ప్రపంచ దేశాల నేతలకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను మోదీ వివరిస్తూ, పటిష్ఠమైన సంస్థాగత వ్యవస్థ, స్వతంత్రంగా వ్యవహరించే రెగ్యులేటరీ ఏజన్సీ, సుశిక్షితులైన ప్రత్యేక నైపుణ్యం కలిగిన సిబ్బంది ద్వారా అణు భద్రతకు అత్యధిక జాతీయ స్థాయి ప్రాధాన్యతను ఇవ్వడాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. అణు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే, తిప్పి కొట్టే టెక్నాలజీని అభివృద్ధి చేసి, అమలు చేయడం ఈ ప్రణాళికల్లో ఒకటి. భౌతిక, సాంకేతికపరమైన అడ్డంకులు కల్పించడం, సాంకేతిక విధానాలను అమలు చేయడం, తక్కువ స్థాయిలో శుద్ధి చేసిన యురేనియంను ఉపయోగించి, అలాగే సీసియమ్-137 లాంటి రేడియో ఐసోటోప్స్‌ను ఉపయోగించి మెడికల్ గ్రేడ్ మోలీ-99ని ఉత్పత్తి చేయడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయడం లాంటివి ఈ ప్రణాళికల్లో ఉన్నాయి.
అణు స్మగ్లింగ్‌ను భారత్ తిప్పి కొడుతుందని, అణు, అణు ధార్మిక మెటీరియల్స్‌కు సంబందించి జాతీయ డిటెక్షన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆయన చెప్తూ, అణు స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అణు భద్రత నిధికి మరో పది లక్షల డాలర్ల నిధులను విరాళంగా ఇవ్వడం ద్వారా అణు భద్రతలో ఐఏఇఏ నిర్వహిస్తున్న కీలక పాత్రకు భారత్ మద్దతు ఇస్తుందని కూడా ప్రధాని చెప్పారు. అణు భద్రతపై ఐఏఇఏ నిపుణులతో భారత్‌లో ఒక వర్క్‌షాపును నిర్వహించనున్నట్లు కూడా ఆయన చెప్పారు. చివరగా 2017లో అణు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అపపంచ దేశాలు తీసుకన్న చర్యలపై ఒక అంతర్జాతీయ సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తుందని కూడా ప్రధాని తెలిపారు. దేశంలో అణు భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం జరుగుతోందని, అంతర్జాతీయ స్థాయిలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే కృషిలో కూడా భారత్ పాలు పంచుకుందని ఆ జాతీయ కార్యాచరణ ప్రణాళిక పేర్కొంది. అణు భద్రత, సెక్యూరిటీ విషయంలో భారత్ తీసుకున్న చర్యలను, భారత దేశపు రోడ్‌మ్యాప్‌ను, విజన్‌ను ప్రధాని సదస్సులో ఆవిష్కరిస్తారని శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ కూడా చెప్పారు.

చిత్రం అణు భద్రతపై వాషింగ్టన్‌లో జరిగిన శిఖరాగ్ర సదస్సు వేదికపై ప్రపంచ దేశాల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ