అంతర్జాతీయం

గుబులు పుట్టిస్తున్న ‘అణు’ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 19: గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా యావత్ ప్రపంచానికి అణుయుద్ధ భయం పట్టుకుందని, అమెరికా ఉత్తర కొరియాల మధ్య ఎప్పుడు ఈ రకమైన యుద్ధం ముంచుకొస్తుందోనని తల్లడిల్లి పోతోందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గాటరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాపై గత కొన్ని వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అలజడి చెలరేగుతున్న నేపథ్యంలో మంగళవారం మొదలైన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాలను కవ్వించే రీతిలో ఉత్తర కొరియా అణు, క్షిపణి ప్రయోగాలకు పాల్పడుతోందని దీని ఫలితంగా లక్షలాది మంది అలజడికి గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అణ్వాయుధ ప్రయోగం జరిగితే కలిగే నష్టాన్ని ఊహించలేమని, ఆ ఆలోచనే ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. 193 దేశాల జనరల్ అసెంబ్లీ చర్చల్లో ఉత్తర కొరియా అంశమే ప్రధానమవుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ఈ స్థాయిలో ప్రపంచం ఆందోళన చెందిన అంశం మరోటి లేదని తన ప్రసంగంలో ఐరాస జనరల్ సెక్రటరీ పేర్కొన్నారు. ఉత్తర కొరియా అత్యంత శక్తివంతమైన అణు పరీక్ష జరపడంతో పాటు జపాన్‌పై క్షిపణులను ప్రయోగించడంతో అన్ని దేశాలు దానిపై వత్తిడి తెచ్చాయని గుర్తుచేశారు. అయితే చైనా రష్యాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర కొరియాపై సైనిక చర్యకు దిగకూడదని హెచ్చరించాయని అన్నారు. యు ద్ధానికి దిగకుండా చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నాలను చేపట్టామని అన్నారు. పరిస్థితి చక్కదిద్దాల్సింది పోయి అగ్నికి ఆజ్యం పోసే రీతిలో కవ్వింపు చర్యలకు పాల్పడితే అది అనేక రకాలుగా ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంటుందని గాటరస్ హెచ్చరించారు. గుడ్డిగా యుద్ధానికి దిగడం వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదని సమస్యను రాజనీతిజ్ఞతతో పరిష్కరించుకోవడమే ఉత్తమ ప్రయత్నమని అన్నారు. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిమ్‌లపై జరుగుతున్న దాడులను ఆపాలని అక్కడి ప్రభుత్వానికి విజప్తి చేశారు. మయన్మార్‌లోని రకీనా రాష్ట్రంలో ముస్లిమ్ మైనార్టీల ఏరివేత అనేక రకాలుగా వర్గ పరమైన ఉద్రిక్తతలకు కారణమవుతుందన్నారు. వెంటనే సైనిక చర్యలను కట్టిపెట్టి మానవీయ సాహాయానికి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

చిత్రం..ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతున్న సెక్రటరీ జనరల్ ఆంటోనియో గాటరెస్