అంతర్జాతీయం

తనిఖీలకు భయపడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెపిటా (మైన్మార్), సెప్టెంబర్ 19: మైన్మార్‌లోని రోహింగ్యాల విషయంలో చెలరేగుతున్న వివాదంపై ఆ దేశ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. తమ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం లేదని, అంతర్జాతీయంగా ఇందుకు సంబంధించి తనిఖీలు జరిగినా తాము భయపడేది లేదని మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. నెల రోజుల వ్యవధిలో నాలుగు లక్షల మందికి పైగా రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు ప్రాణభయంతో పరారైన నేపథ్యంలో మాట్లాడిన సూకీ ‘మా దేశంలోని ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. అక్కడ ఎలాంటి అలజడి జరగడం లేదు. దాదాపు 50 శాతానికి పైగా ఈ ముస్లిం మైనారిటీ గ్రామాల్లోని ప్రజలు నిర్భయంగానే జీవిస్తున్నారని’ అన్నారు. మైన్మార్‌లో ప్రజాస్వామ్య పరిస్థితుల పునరుద్ధరణకు దాదాపు రెండు దశాబ్దాలపాటు పోరాడిన ఆంగ్ సాన్ సూకీ నాయకత్వానికి రోహింగ్యాల వ్యవహారం మాయని మచ్చగా మారింది. గత నెల 25న రోహింగ్లా మిలిటెంట్లు భద్రతా దళాలపై దాడి చేసినప్పటి నుంచి ప్రతీకార దాడులు తీవ్రమయ్యాయి. దాంతో వందలాది మంది అమాయకులూ మరణించారు. భద్రతా దళాలు తీవ్రస్థాయిలో దాడులు చేయడంతో లక్షల సంఖ్యలో తమ తమ గ్రామాల నుంచి వీరు పరారయ్యారు. అయితే ఈ పరిస్థితికి రోహింగ్యాలే కారణమని మైన్మార్ ప్రభుత్వం వాదిస్తుంటే, భద్రతా దళాలు తమను వేధిస్తున్నాయని రోహింగ్యాలు ప్రత్యారోపణలకు దిగడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీనిపై వివరణ ఇచ్చిన సూకీ కల్లోల ప్రాంతాల్లో శాంతిభద్రతల పునరుద్ధరణకు తాము ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. మైనారిటీ ముస్లింలు ఎక్కువగా ఉన్న రఖీనా రాష్ట్రంలో అల్లర్లు కొనసాగుతున్నప్పటికీ సాయుధ ఘర్షణలు తగ్గాయని, సైనిక దాడులూ ఆగిపోయాయని వెల్లడించారు. అయినప్పటికీ కూడా దేశంనుంచి పరారవుతున్న ముస్లిం మైనారిటీల ఆవేదనను అర్థం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ‘అసలు ఇంతమంది ఎందుకు దేశం వదిలి వెళ్లిపోతున్నారు?’ అని ప్రశ్నించిన సూకీ ప్రస్తుతం ఈ గ్రామాల్లో ఉంటున్నవారికి లేని భయం పారిపోతున్న వారికి ఎలా వచ్చిందని నిలదీశారు. నిజానికి దేశంలో కల్లోల పరిస్థితులే నెలకొంటే అవి దేశమంతా తలెత్తి ఉండేవని, కేవలం రోహింగ్యాలు నివసిస్తున్న ప్రాంతంలోనే ఇవి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. దేశంలో శాంతిభద్రతల పరిస్థితులను, మానవ హక్కుల ఉల్లంఘనలను పరిశీలించడానికి వచ్చేవారికి తమ ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ఇదిలావుండగా, మైన్మార్ సంక్షోభాన్ని అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసేందుకు తమకు పూర్తి అధికారం ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఉల్లంఘనల నిరోధక అధికారులు డిమాండ్ చేశారు. అయితే ఐక్యరాజ్య సమితి ఈ అంశంపై దర్యాప్తు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని, అయినప్పటికీ కూడా ఐరాసతో సహకరించి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.