అంతర్జాతీయం

నిరుద్యోగులే వాళ్లను నెగ్గించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రిన్స్‌టన్ (అమెరికా), సెప్టెంబర్ 20: నిరుద్యోగుల్లో పెరిగిపోయిన నిరాశ, నిస్పృహల నుంచే డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీలాంటి నేతలు ఎన్నికయ్యారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణం కూడా ఇదేనని విశే్లషించారు. ‘తగినన్ని ఉద్యోగావకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది. అందుకే, ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది’ అన్నారు. రెండువారాల అమెరికా టూర్‌లో భాగంగా ప్రఖ్యాత ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో రాహుల్ ఈ విషయాలను ప్రస్తావించారు. ఏ దైశంలోనైనా బలమైన జాతి నిర్మాణం ఉపాధి కల్పన నుంచే మొదలవుతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘్భరత్‌లో మోదీ ప్రధాని కావడానికి, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష స్థానంలో కూర్చోడానికి కారణం ఆయా దేశాల్లోని ప్రజల ఉపాధి తహతహే. రెండు దేశాల్లోనూ అపారమైన మానవ వనరులున్నా, తగినన్ని ఉద్యోగావకాశాలు లేవు. ఈ విషయంలో నిరంతరం నిరుద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిలో మార్పులు తెస్తారన్న చిన్న ఆశతోనే నరేంద్ర మోదీ, ట్రంప్‌ను ప్రజలు ఎన్నుకున్నారని అనుకుంటున్నా’ అని రాహుల్ అన్నారు. చిత్రమైన విషయం, నిరుద్యోగాన్ని ఇప్పటికీ సమస్యగా నేతలెవ్వరూ చూడటం లేదని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నాకు ట్రంప్ గురించి తెలీదు. ఆయనతో పని లేదు కూడా. కానీ, భారత ప్రధాన మంత్రి మాత్రం ఈ విషయంలో సమర్థమైన పనితీరు ప్రదర్శించటం లేదు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ తన టూర్‌లో ప్రధానంగా భారత్‌లోని నిరుద్యోగ సమస్యలపై ప్రస్తావిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిపుణులు, వ్యాపార దిగ్గజాలు, యుఎస్ కాంగ్రెస్ సభ్యులను కలిసిన సందర్భంలో నిరుద్యోగ సమస్యను రాహుల్ ప్రధానంగా ప్రస్తావించారు. బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడిన సందర్భంలోనూ ఇదే విషయంపై గట్టిగా మాట్లాడారు. ‘్భరత్‌లో అపారమైన మానవ వనరులున్నాయి. అయితే తగినన్ని ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. ఇప్పటికీ ఉద్యోగావకాశాల కల్పనలో వెనుకబడే ఉన్నారు. రోజూ 33వేల మంది యువత ఉద్యోగానే్వషణతో మార్కెట్‌కు వస్తుంటే, ప్రభుత్వం మాత్రం 500 ఉద్యోగాలు కూడా కల్పించలేకపోతోంది’ అని రాహుల్ లెక్కలు చెప్పిన విషయం గమనార్హం.

పారిస్ ఒప్పందానికి మించి పని చేస్తాం

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 20: ‘పర్యావరణ పరిరక్షణకు మరింత ధృఢ సంకల్పంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాలుష్య నియంత్రణపై పారిస్ ఒప్పందానికి మించి పని చేస్తున్నాం, చేస్తాం’ అని భారత్ స్పష్టం చేసింది. పర్యావరణ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఐదు దేశాధినేతల సదస్సు వేదికనుంచి భారత ప్రతినిధిగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పర్యావరణం, ప్రపంచ ప్రగతి అంశాలపై చర్చించేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గాటరెస్ హాజరైన సమావేశంలో సుష్మ విస్పష్టంగా ప్రకటించారు. పారిస్ ఒప్పందాన్ని భారత్, చైనా మితిమీరిన ప్రయోజనంగా స్వీకరిస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సుష్మ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు దేశాల వైఖరి కారణంగా అమెరికా పక్కకు తప్పుకునే యోచనలో ఉందంటూ ట్రంప్ గత జూన్‌లో వ్యాఖ్యానించారు. ‘్భగోళం పట్ల మా బాధ్యత మేం అర్థం చేసుకున్నాం. ఈ విషయంలో పారిస్ ఒప్పందానికి మించే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ భారత ప్రతినిధి సుష్మస్వరాజ్ ప్రకటించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. ‘సౌరశక్తి వినియోగంలో కూటమి దేశమైన ఫ్రాన్స్‌తో కలిసి భారత్ పని చేస్తుంది’ అని కూడా సుష్మ ప్రకటించారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో భూ పర్యావరణ పరిస్థితిని భారత్ సీరియస్‌గానే తీసుకున్నట్టు సుష్మ ప్రకటించడాన్ని రవీష్‌కుమార్ ట్వీట్ చేశారు. అంతకంతకూ పెరిగిపోతున్న ఉష్ణతాపాన్ని తగ్గించేందుకు కర్బన ఉద్గారాల వినియోగాన్ని నియంత్రించి, పర్యావరణ సమతుల్యత సాధించే లక్ష్యంతో పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన దేశాల్లో భారత్ ఒకటి. కర్బన ఉద్గార కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో మొదటి మూడో స్థానంలో వున్న భారత్ సహా, కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న 190 దేశాలు 2015 డిసెంబర్‌లో పారిస్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. పెరిగిపోయిన ఉష్ణోగ్రతలను కనీసం 2 డిగ్రీలకైనా తగ్గించాలన్న లక్ష్యంతో పారిస్ ఒప్పందంలో చేరిన దేశాలు పని చేస్తున్నాయి. 1997 క్యోటో ప్రోటోకాల్ స్థానంలో పారిస్ ఒప్పందం ఆమోదం పొందడం తెలిసిందే.