అంతర్జాతీయం

డెమోక్రటిక్ నామినేషన్‌కు అడుగు దూరంలో హిల్లరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజెలిస్, జూన్ 6: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. కాలిఫోర్నియాలో కీలక ప్రైమరీ ఎన్నికలకు ముందు జరిగిన రెండు ప్రైమరీల్లో హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్ధి బెర్నీ శాండర్స్‌ను ఓడించారు. ప్యూర్టోరికోతో పాటు వర్జిన్ ఐలెండ్స్‌లో జరిగిన ఈ ప్రైమరీల్లో శాండర్స్‌పై హిల్లరీ ఘన విజయం సాధించారు. దీంతో ఆమె అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్‌ను కైవసం చేసుకునేందుకు మరో అడుగు దూరంలో నిలిచారు. ఈ నామినేషన్ లభిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పార్టీ తరఫున పోటీచేసే తొలి మహిళా అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ చరిత్రకెక్కుతారు. కాలిఫోర్నియా సహా ఆరు రాష్ట్రాల్లో మంగళవారం జరిగే ప్రైమరీ ఎన్నికలు పూర్తయితే హిల్లరీ క్లింటన్ నామినేషన్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రతినిధుల మద్దతు లభించడం ఖాయమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ను దక్కించుకోవాలంటే కనీసం 2,382 మంది ప్రతినిధుల మద్దతును పొంది ఉండాలి.
ఇప్పటికే 2,354 మంది ప్రతినిధుల మద్దతును కూడగట్టుకున్న హిల్లరీ క్లింటన్‌కు నామినేషన్ లభించాలంటే మరో 28 మంది ప్రతినిధులు మద్దతు తెలిపితే సరిపోతుంది. అయితే ఇప్పటివరకూ 1,565 మంది ప్రతినిధుల మద్దతు పొందిన బెర్నీ శాండర్స్ ఈ విషయంలో హిల్లరీ కంటే ఎంతో వెనుకబడి ఉంది. మంగళవారం ప్రైమరీ ఎన్నికలు జరిగే కాలిఫోర్నియాలో మొత్తం 546 మంది ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొననుండగా, మోంటానలో 27 మంది, న్యూజెర్సీలో 142 మంది, నార్త్ డకోటాలో 23 మంది, సౌత్ డకోటాలో 25 మంది, న్యూ మెక్సికోలో 43 మంది ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొననున్నారు.