అంతర్జాతీయం

లండన్‌లో న్యూడ్ హోటల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 9: లండన్‌లో ఓ కొత్త హోటల్ వినూత్న పంథాలో వెలసింది. ‘బున్యాదీ’ అన్న హిందీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ హోటల్ లండన్‌లో తొలి నగ్న హోటల్‌గా ప్రారంభమైంది. బున్యాదీ అంటే పునాది అని అర్థం అని యజమానులు తెలిపారు. హోటల్‌కు వచ్చే వినియోగదారులు పూర్తి సహజత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకే ఈ హోటల్‌ను ప్రారంభించినట్లు వారు వెల్లడించారు. వినియోగదారులు హోటల్‌కు బట్టలు వేసుకోవటం అనేది ఐచ్ఛికమని వారు చెప్పారు. ‘మా హోటల్‌కు వచ్చే వినియోగదారులు ఆ రాత్రిని ఎలాంటి భేషజాలు లేకుండా హాయిగా గడపాలన్నదే మా ఉద్దేశం. మా దగ్గర కృత్రిమ రసాయనాలు ఉండవు. కృత్రిమ రంగులు ఉండవు. విద్యుత్తు ఉండదు. గ్యాస్ ఉండదు. ఫోన్ ఉండదు. అలాగే బట్టలు కూడా వినియోగదారులు వద్దనుకుంటే ఉండవు. నిజమైన స్వాతంత్య్రానికి ఈ హోటల్ ప్రతీక’ అని లాలీపాప్ వ్యవస్థాపకుడు సెబ్‌లియాల్ అన్నారు. హోటల్‌లో నగ్నంగా గడిపేందుకు, క్యాండిల్ లైట్ ఏర్పాట్లకు సహజమైన వెదురు విభాగాలను రూపొందించేందుకు చాలా కష్టపడ్డామని ఆయన వివరించారు. ఇక్కడ ఆహారాన్ని కూడా మట్టితో తయారు చేసిన పాత్రల్లో అందిస్తారు. వినియోగదారులు తమ ఫోన్లను, ఇతర గాడ్జెట్లను హోటల్ డోర్ బయటే వదిలేసి లోపలికి రావలసి ఉంటుంది. బట్టలు వేసుకునే ఉండాలనుకునే వారికి ప్రత్యేక సెక్షన్‌ను ఏర్పాటు చేశారు. శాకాహార, మాంసాహార పదార్థాలతో పాటు సహజమైన పద్ధతులలో రూపొందిచిన వైన్‌ను అందిస్తారు. 42మందికి మాత్రమే ఒక సారి సిటింగ్‌కు అవకాశం ఉన్న ఈ హోటల్‌లో డిన్నర్ కోసం రాబోయే మూడు నెలల కాలానికి 44,200మంది ముందే బుక్ చేసుకోవటం విశేషం.

చిత్రం లండన్‌లో తొలి నగ్న హోటల్‌గా ప్రారంభమైన ‘బున్యాదీ’ లో విందు ఆరగిస్తున్న దృశ్యం