అంతర్జాతీయం

సూపర్ ఎర్తే ప్లానెట్-9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 13: మన సౌరవ్యవస్థలో అదృశ్య గ్రహంగా, అదే విధంగా సూపర్ ఎర్త్‌గా కూడా భావిస్తున్న ప్లానెట్-9కు సంబంధించి శాస్తవ్రేత్తలు మరిన్ని ఆసక్తికర వివరాలను వెలుగులోకి తెచ్చారు. ఈ ప్లానెట్-9 ద్రవ్యరాశి భూమికంటే పదిరెట్లు ఎక్కువని, అదేవిధంగా సూర్యుడి చుట్టూ పరిభ్రమించే నెప్ట్యూన్ కంటే కూడా 20 రెట్లు దూరంలోనే ఇది ఉందని వెల్లడించారు. మన సౌరవ్యవస్థలో అదృశ్యమైన సూపర్ ఎర్తే ఈ ప్లానెట్-9 కావచ్చునని శాస్తవ్రేత్తలు వెల్లడించారు. భూమికంటే కూడా ఈ గ్రహం ఎన్నో రెట్లు పెద్దదైనప్పటికీ మంచు గ్రహాలుగా భావిస్తున్న యురేనస్, నెప్ట్యూన్‌ల కంటే కూడా ద్రవ్యరాశి పరంగా చిన్నదేనని వివరించారు. ఇప్పటివరకు ఈ సూపర్ ఎర్త్‌కు సంబంధించి పరోక్షమైన సంకేతాలే తప్ప ప్రత్యక్షంగా ఏదీ అందుబాటులోకి రాలేదని, దాని గురుత్వాకర్షక ముద్రలను బట్టే ఈ గ్రహ ఆచూకీని అంచనా వేసే అవకాశం ఉంటుందని శాస్తవ్రేత్తలు వెల్లడించారు. ప్లానెట్ -9 ఉనికికి సంబంధించి మొత్తం ఐదు రకాలుగా శాస్తవ్రేత్తలు పరిశోధనలు జరుపుతున్నారని కాలిఫోర్నియా టెక్నాలజీ యూనివర్శిటీకి చెందిన ఖగోళ భౌతికవేత్త కాన్‌స్టాంటిన్ బాటిజిన్ వెల్లడించారు. ఇప్పటివరకు అందిన సంకేతాలను విస్మరించి అసలు ప్లానెట్-9 అన్నదే లేదని ఓ నిర్ధారణకు వస్తే అది మరిన్ని సమస్యలకు, సౌరవ్యవస్థ అధ్యయనానికి సంబంధించిన సవాళ్లను మరింత పెంచే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
మొత్తం ప్లానెట్-9 సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్న వారిని సంతృప్తిపరచాలంటే అనేక రకాలుగా వివరణలను ఇచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్లానెట్-9 అన్నది 4.5 బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర వ్యవస్థ దిశగా వచ్చి ఉండవచ్చునని శాస్తవ్రేత్తలు వెల్లడించారు. రానున్న కాలంలో ఖగోళవేత్తలను అత్యంత విస్తృత స్థాయిలో ఈ అదృశ్య గ్రహం ఆకర్షించే అవకాశం ఉందని బాటిజిన్ వెల్లడించారు.