అంతర్జాతీయం

నిధుల మంజూరీని తక్షణం సమీక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 15: వేగవంతమైన భారత మార్కెట్ విస్తృతిని దృష్టిలో పెట్టుకుని రుణాల కేటాయింపులను అంతర్జాతీయ ద్రవ్య నిధి సమీక్షించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సదస్సులో పాల్గొనేందుకు వాషింగ్టన్ వెళ్లిన జైట్లీ, అక్కడి ఆర్థిక నిపుణుల వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 15వ సర్వసభ్య సమావేశాల్లో రుణ కేటాయింపుల అంశం సమీక్షకు రాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘ప్రపంచ ఆర్థిక పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ విస్తృతిని బట్టే దేశాలకు నిధుల కేటాయింపులు జరగాలి. ఇది తక్షణ అంశంగా ఐఎంఎఫ్ గుర్తించినప్పుడే, నిర్వహణలో పారదర్శకత చోటుచేసుకుంటుంది’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ 15వ ద్రవ్య సమీక్షలో ప్రస్తావించే అంశాలను 2019నాటికి పూర్తి చేసేందుకు భారత్ శాయశక్తులా కృషి చేస్తుందని జైట్లీ స్పష్టం చేశారు. అయితే, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కేవలం రుణాలిచ్చే సంస్థగానే కాకుండా, ప్రపంచ ఆర్థికత, స్థిరమైన సామాజిక నిర్మాణం కోసం కూడా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఆలస్యమైనా, ప్రస్తుత సమావేశాల్లో లిమా రోడ్‌మ్యాప్‌కు ఏకగ్రీవ ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నట్టు జైట్లీ చెప్పారు. అభివృద్ధి పథకాలపై హామీమేరకు నిధులు మంజూరు చేయడాన్ని వేగంగా పూర్తిచేయాలని, రుణాల మంజూరీలో ఆలస్యం ఆయా దేశాల ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని జైట్లీ అన్నారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలోనే కాదు, ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలోనూ భారత్ ఎప్పుడూ నమ్మకాన్ని వమ్ముచేయలేదని గుర్తు చేశారు.
అయితే, పెరుగుతున్న జనాభా, పరిణామాత్మక వాణిజ్య నష్టాల పెరుగుదల కారణంగా దేశాల రుణ చెల్లింపు సామర్థ్యం దారుణంగా దెబ్బతింటుందని అన్నారు. ప్రపంచ దేశాలు ఆ పరిస్థితిని అధిగమించాలంటే సహకారాత్మక, వ్యూహాత్మక ఉమ్మడి కృషితోనే సాధ్యమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు.