అంతర్జాతీయం

ఆగని రోహింగ్యాల వలస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోక్స్‌బజార్, అక్టోబర్ 16: బౌద్ధమత గుంపుల దాడులతో ప్రాణాలకు ముప్పు, బతికి బయటపడ్డా చంపేస్తున్న ఆకలి.. ఇదీ మైన్మార్‌లోని రోహింగ్యా ముస్లింల దీన పరిస్థితి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మైన్మార్ నుంచి పారిపోవడం మినహా రోహింగ్యాలకు మరో అవకాశం లేకుండా పోయింది. సోమవారం తెల్లవారు జామున కూడా వేలాది మంది రోహింగ్యాలు మైన్మార్ నుంచి పిల్లలను తమ వీపులకు కట్టుకొని నడుము లోతు నీటిలో నడుచుకుంటూ బంగ్లాదేశ్ భూభాగంలో అడుగుపెట్టారు. రుతుపవనాల కాలం మూలంగా నడుము లోతు నీటిలో, చెట్ల పొదల గుండా రోజుల తరబడి నడిచి బంగ్లాదేశ్‌కు చేరుకున్నామని అనేక మంది రోహింగ్యాలు సోమవారం ఒక వార్తాసంస్థకు చెప్పారు. పాలోంగ్‌ఖలి గ్రామ సమీపంలో సోమవారం ఎంతకూ ఎడతెగని రోహింగ్యా ముస్లిం ప్రజల ప్రవాహం బంగ్లాదేశ్‌లోకి సాగుతుండటం కనిపించింది. ఆగస్టు 25 నుంచి ఇప్పటివరకు బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చిన 5,36,000 మంది రోహింగ్యా శరణార్థులలో సోమవారం వచ్చిన వారు కూడా చేరిపోయారు. మైన్మార్‌లో భద్రతా బలగాలు తమను దోచుకుంటున్నాయని, హతమారుస్తున్నాయని, మహిళలను రేప్ చేస్తున్నాయని వారు ఆరోపించారు.
పడవ మునిగి 12మంది మృతి
అయితే మైన్మార్ నుంచి బయల్దేరిన ప్రతి ఒక్కరూ ప్రాణాలతో బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టడం లేదు. పాలోంగ్‌ఖలి గ్రామానికి దక్షిణాన కొన్ని కిలో మీటర్ల దూరంలో ఒక పడవ మునిగి 12 మంది రోహింగ్యాలు మృతి చెందారు. మరో 35 మంది గల్లంతయ్యారు.

చిత్రం..పడవ ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను ఒడ్డుకు తీసుకువస్తున్న దృశ్యం