అంతర్జాతీయం

‘పఠాన్‌కోట్’ ఓ కుంటిసాకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 9: ద్వైపాక్షిక చర్చల ప్రక్రియను దెబ్బతీసేందుకు ‘పఠాన్‌కోట్’ దాడిని భారత్ ఓ కుంటిసాకుగా చూపుతోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఉగ్రవాద సంబంధిత అంశాలతోసహా ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్న అనేక ఇతర అంశాలను కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే పాకిస్తాన్ విధానమని ఆ దేశ విదేశ వ్యవహారాలలో ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ గురువారం మీడియాతో అన్నారు. 2015 డిసెంబర్‌లో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్తాన్‌కు వచ్చినప్పుడు చర్చల కొనసాగింపునకు అంగీకరించారని, జనవరి 2న పఠాన్‌కోట్‌పై ఉగ్రదాడి జరగటంతో చర్చల ప్రక్రియ నిలుపుదలకు భారత్‌కు ఓ కారణం దొరికినట్లయిందని అజీజ్ విమర్శించారు. వాస్తవానికి పఠాన్‌కోట్ దాడిలో నిందితులపై దర్యాప్తు చేసేందుకు పాకిస్తాన్ అవసరమైన చొరవ చూపించిందని, ఓ సంయుక్త విచారణ బృందాన్ని పఠాన్‌కోట్‌కు కూడా పంపించిందని అజీజ్ వివరించారు. ప్రధానమంత్రిగా నవాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ప్రభుత్వం సాధించిన విజయాలను అజీజ్ విలేఖరులకు వివరించారు. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలను కొనసాగిస్తూనే ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికలపైనా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంటామని అజీజ్ స్పష్టం చేశారు. కశ్మీరీల పోరాటానికి పాకిస్తాన్ మద్దతు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని అజీజ్ మరోసారి తేల్చిచెప్పారు.