అంతర్జాతీయం

బంగ్లాకు పెరుగుతున్న రోహింగ్యాల వలస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, అక్టోబర్ 17: మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌లోకి చేరుకున్న రోహింగ్యా శరణార్థుల సంఖ్య ఒక్క ఆగస్టులోనే సుమారు 5.8 లక్షల వరకూ ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇంకా సరిహద్దుల్లో వేలాది శరణార్థులు పడిగాపులు కాస్తున్నారని పేర్కొంది. గతవారం విడుదల చేసిన లెక్కలతో ప్రస్తుత అంకెను పోలిస్తే, ఒక్కవారంలోనే అదనంగా 45 వేలమంది శరణార్థులు బంగ్లాదేశ్‌లోకి చేరినట్టు తెలుస్తోందని పేర్కొంది. ఐరాస బాలల సంక్షేమ విభాగం అధికార ప్రతినిధి మారిక్సీ మార్కాడో మీడియాతో మాట్లాడుతూ ఈ సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది కాదన్నారు. బంగ్లాదేశ్‌కు చేరుతున్న శరణార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందన్నారు. అలాగే, అనేకమంది శరణార్థులు గత లెక్కల్లోలేరని, ఇప్పుడు వీళ్లంతా తాజా లెక్కల్లోకి చేరారని వివరించారు. మయన్మార్‌లోలోని రఖీనా రాష్ట్రంలో అధికంగావున్న ముస్లిం మైనారిటీలను ఏరివేయడంపైనే సైన్యం దృష్టిన కారణంగా ఈ పరిస్థితి కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే, గత ఆగస్టు 25న ప్రభుత్వ బలగాలపై రోహింగ్యాలు మిలిటెంట్ దాడికి దిగిన తరువాత, రఖీనా రాష్ట్రాన్ని బలగాలు మరింత టార్గెట్ చేయడంతో వలసలు అంతకంతకూ పెరుగుతున్నాయని ఐరాస శరణార్థుల సంక్షేమ విభాగం అధికార ప్రతినిధి ఆండ్రెజ్ మహెసిక్ అభిప్రాయపడ్డారు. ‘ఈ పరిస్థితి బంగ్లాదేశ్- మయన్మార్ బోర్డర్‌లో శరణార్థుల సంఖ్య మరింత పెరగడానికి కారణమైంది’ అని వ్యాఖ్యానించారు. ‘గత ఆదివారం అర్థరాత్రి నుంచే 10నుంచి 15వేల మంది శరణార్థులు అంజుమన్ పారా సరిహద్దును దాటి బంగ్లాదేశ్‌లోని ఉఖియా జిల్లాలోకి అడుగుపెట్టారని ఆయన వెల్లడించారు. సైనిక దాడులకు భయపడే రఖినీ ప్రాంతంలోని మిగిలిన మైనారిటీ ముస్లింలు సైతం సరిహద్దులు దాటే ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ‘రఖినీలోని పరిస్థితుల నేపథ్యంలో రోహింగ్యాలు నిమిషాలు లెక్కపెట్టుకుంటున్నారు. ఆమేరకు బంగ్లాదేశ్‌కు వలస వస్తున్న రోహింగ్యాల సంఖ్య పెరుగుతూనే ఉంది’ అని మెహెసిస్ వ్యాఖ్యానించారు.

చిత్రం..మైన్మార్ నుంచి తాజాగా వలసవచ్చిన రోహింగ్యా శరణార్థులు