అంతర్జాతీయం

మూడో కేసులోనూ నవాజ్‌కు అభిశంసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 20: విదేశీ కంపెనీలు, అలాగే పెట్టుబడులకు సంబంధించిన 3వ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అకౌంటబులిటీ కోర్టు అభిశంసించింది. షరీఫ్‌పై మొత్తం మూడు అవినీతి, మనీలాండరింగ్ కేసులు దాఖలయ్యాయి. కేసులను జాతీయ అకౌంటబులిటీ బ్యూరో దాఖలు చేసింది. గత నెల 8న షరీఫ్ కుటుంబ సభ్యులపై కూడా అవినీతి కేసులు దాఖలయ్యాయి. పనామా పత్రాల కుంభకోణంలో నవాజ్ షరీఫ్‌పై తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయనను పాకిస్తాన్ సుప్రీం కోర్టు జూలై 28న బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈ అవినీతి కేసులు దాఖలయ్యాయి. ప్రస్తుతం లండన్‌లో ఉన్న నవాజ్ తనపై దాఖలైన కేసులకు సంబంధించి, అలాగే తనను పదవి నుంచి తప్పించడం గురించి తీవ్ర స్వరంతో మాట్లాడారు. తాను లేకుండా తనకు సంబంధించిన కేసులను విచారించి తనను దోషిగా పరిగణించడం న్యాయాన్ని ఖూనీ చేయడమేనని ఆరోపించారు. ఈ నెల 26న జరిగే తదుపరి విచారణలోగా తాను పాకిస్తాన్ వస్తానని ఆయన వెల్లడించారు. అయితే ఆదివారం నాడే ఆయన స్వదేశానికి వచ్చే అవకాశం ఉందంటూ కథనాలు వెలువడ్డాయి.