అంతర్జాతీయం
హఫీజ్ గృహనిర్బంధం పొడిగింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 October 2017
లాహోర్, అక్టోబర్ 20: ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడైన జమాద్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్ గృహ నిర్బంధ కాలాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించారు. పంజాబ్ రాష్ట్రంలోని జుడీషియల్ రివ్యూ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే సరుూద్‌కు చెందిన మరో నలుగురు సహచరులు నిర్బంధాన్ని పొడిగించాలన్న అభ్యర్థనను బోర్డు తిరస్కరించింది. ఈనెల 24 నుంచి సరుూద్ తాజా నిర్బంధం అమలులోకి వస్తుందని మిగతా నలుగురి నిర్బంధకాలం ముగియడంతో విడుదల చేయడం జరుగుతుందని బోర్డు తెలిపింది. అయితే వీరి విడుదల అన్నది ఇతర కేసుల్లో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోని పక్షంలోనే జరుగుతుందని స్పష్టం చేసింది.