అంతర్జాతీయం

ద్వైపాక్షిక బంధమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 22: రెండు రోజుల పర్యటన నిమిత్తం విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం ఢాకా చేరుకున్నారు. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాల పెంపునకు ఆ దేశాధినేతలతో చర్చలు జరుపుతారు. ప్రత్యేక విమానంలో ఢాకాలోని బంగబంధూ ఎయిర్‌బేస్‌లో దిగిన సుష్మా స్వరాజ్‌కు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎహెచ్ మహ్మూద్ అలీ స్వాగతం పలికారు. బంగ్లాదేశ్‌తో జరిగే చర్చల్లో ముఖ్యంగా తీస్తానదీ ఒప్పందం, రోహింగ్యాల సమస్య తదితర అంశాలున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బంగ్లా పర్యటనలో సుష్మా స్వరాజ్ చాంబర్ ఆఫ్ కామర్స్, పరిశ్రమలు, సాంస్కృతిక శాఖ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశాలున్నట్లు బంగ్లాదేశ్‌లోని భారత రాయబారి తెలిపారు. బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ వివరాల మేరకు సుష్మా స్వరాజ్ ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, విపక్ష నేత రౌషన్ ఎర్షాద్, మాజీ ప్రధాని ఖలీదా జియాతో సమావేశమవుతారు.
బంగ్లాదేశ్‌లోని ఖుల్నా నగరంలో రెండు దేశాల భాగస్వామ్యంతో ఒక ప్రాజెక్టును చేపట్టడంతోపాటు బంగ్లాదేశ్‌కు హై-స్పీడ్ డీజిల్ సరఫరాకు సంబంధించిన అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అలాగే భారత ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టులు, రైల్వే, రోడ్లు, షిప్పింగ్ తదితర పనులను సుష్మా స్వరాజ్ పరిశీలిస్తారు. బంగ్లాదేశ్‌లో చైనా ఆధిపత్యం పెరగకుండా చూసేందుకు ఇలాంటి ప్రాజెక్టుకు భారత్ సహాయ సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే.

చిత్రం..ఢాకాలో ఆదివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సమావేశమైన సుష్మా స్వరాజ్