అంతర్జాతీయం

ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వంకు మెక్సికో మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో సిటీ, జూన్ 9: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం పొందడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మెక్సికో దేశం మద్దతు తెలిపింది. అయిదు దేశాల పర్యటనలో చివరి మజిలీగా గురువారం మెక్సికో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పినా నీటోతో వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంధనం, రోదసీ రంగాలుసహా వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశంపై ఇరువురు నేతలు జర్చలు జరిపారు. చర్చల అనంతరం మోదీతో కలిసి మీడియాతో మాట్లాడిన మెక్సికో అధ్యక్షుడు నీటో ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం పొందడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను మెక్సికో గుర్తించిందని, ఇందుకోసం మద్దతు ఇవ్వాలన్న ఆ దేశ అభ్యర్థనకు తాము సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. కాగా, మద్దతు ఇచ్చినందుకు మెక్సికోకు కృతజ్ఞతలు చెప్పిన మోదీ భారతదేశ ఇంధన భద్రతకు మెక్సికో ఒక ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లడానికి స్పష్టమైన ఫలితాలతో కూడిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి కృషి చేయడానికి ఇరుదేశాలు అంగీకరించినట్లు ఆయన చెప్పారు.
48 దేశాలు సభ్యులుగా ఉన్న ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం పొందడానికి భారత్ చేసుకున్న అభ్యర్థనను చర్చించడానికి ఎన్‌ఎస్‌జి గురువారం వియన్నాలో సమావేశమవుతున్న తరుణంలో భారత్ సభ్యత్వానికి మెక్సికో మద్దతు లభించడం గమనార్హం. ఎన్‌ఎస్‌జి జూలై 24న సియోల్‌లో మరోసారి సమావేశం కానుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి భారత్ చేస్తున్న కృషిని గుర్తించిన అమెరికాసహా ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం ఉన్న పలు దేశాలు ఇప్పటికే మనదేశం ఆ గ్రూపులో సభ్యత్వం పొందడానికి మద్దతు తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే చైనా మాత్రం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదని చెప్తూ, మనదేశం ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తోంది. గత సోమవారం ప్రధాని మోదీ ఎన్‌ఎస్‌జిలో కీలక సభ్య దేశమైన స్విట్జర్లాండ్‌లో పర్యటించినప్పుడు ఆ దేశం మద్దతును కూడా సంపాదించిన విషయం తెలిసిందే.
భారత్ పయనం
అయిదు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని గురువారం భారత్ తిరుగుప్రయాణమయ్యారు. ఈ నెల 4న అయిదు దేశాల పర్యటనకు బయలుదేరిన మోదీ తొలుత అఫ్గానిస్థాన్, ఆ తర్వాత ఖతార్, స్విట్జర్లాండ్‌లలో పర్యటించిన అనంతరం అమెరికాలో మూడు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే. తన పర్యటనలో చివరి మజిలీగా మెక్సికోలో కొద్దిసేపు ఆగిన మోదీ ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్‌పినా నీటోతో కీలక చర్చలు జరిపారు.

చిత్రం మెక్సికోలో గురువారం ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పినా నీటోతో
వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ