అంతర్జాతీయం

27మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, నవంబర్ 9: పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో వేగంగా వెళ్తున్న ఒక బస్సు లోయలో పడి 27 మంది మృతి చెందారు. 69 మంది గాయపడ్డారు. వంద మందికిపైగా ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఈ బస్సు బుధవారం రాత్రి కోహట్ నుంచి రాయివిండ్‌కు వెళ్తుండగా కల్లార్ కహర్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గురువారం తెలిపారు. ఏడాదికోసారి జరిగే ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రయాణికులంతా రాయివిండ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సద్దార్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (స్టేషన్ హౌస్ అధికారి) మహమ్మద్ అఫ్జల్ తెలిపారు. ప్రమాదంలో 24 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఆయన వివరించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏమిటనేది తెలియరాలేదని, అయితే బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటమే కారణమని భావిస్తున్నారు. గాయపడిన వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రావల్పిండి ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ బస్సు వాస్తవానికి ఇస్లామాబాద్, లాహోర్ మోటర్‌వే మీదుగా వెళ్లవలసి ఉన్నప్పటికీ, మరోమార్గంలో వెళ్లింది. పొగ మంచు కారణంగా లాహోర్ మోటర్‌వేను రాత్రి పది గంటల తరువాత మూసివేశారు. పైగా, పరిమితికి మించి ఎక్కువ మంది ప్రయాణికులను మోసుకెళ్లే బస్సులను మోటర్‌వే వద్ద నిలిపివేసి, జరిమానా విధిస్తారు. దీంతో డ్రైవర్ బస్సును గ్రాండ్ ట్రంక్ రోడ్ మీదుగా తీసికెళ్లాడని అఫ్జల్ వివరించారు. ‘డ్రైవర్‌కు ఈ మార్గం కొత్త. పైగా అధిక వేగంతో బస్సును నడుపుతుండగా, ఏటవాలు ప్రాంతం వద్ద అది అదుపు తప్పి లోయలో పడిపోయింది’ అని అఫ్జల్ వివరించారు. పంజాబ్ ముఖ్యమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగయిన వైద్య చికిత్సను అందించాలని కూడా ఆదేశించారు.

చిత్రం..బస్సు ప్రమాద మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న దృశ్యం