అంతర్జాతీయం

బాధ్యత మరచిన సంపన్న దేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 10: వాతావరణ మార్పులను నిరోధించడంలో సంపన్న దేశాలు తమ బాధ్యతను మరచి తప్పించుకుంటున్నాయని అభివృద్ధి చెందుతున్న దేశాలు విమర్శించాయి. వాతావరణ మార్పును నిరోధించడంలో స్వల్ప కాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో సంపన్న దేశాలు విఫలం కావడం వల్ల చరిత్రాత్మక ఒప్పందం అమలుకు ఆటంకంగా మారిందని భారత్, చైనా సహా 134 అభివృద్ధి చెందుతున్న దేశాలు బోన్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంప్రదింపుల్లో హెచ్చరించాయి. 196 దేశాలు పాల్గొన్న ఈ చర్చలలో ఏకాభిప్రాయం కుదరడంలో ఇబ్బందులు తలెత్తాయి. మనం చేసిన నిర్ణయాలను మనమే గౌరవించకపోతే, వివిధ పక్షాల మధ్య విశ్వాసాన్ని మనం ఎలా పాదుకొలుప గలుగుతామని చైనా సీనియర్ దౌత్యవేత్త చెన్ జిహువా అభివృద్ధి చెందిన దేశాల వైఖరిని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నించారు. కర్బన ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్య సాధనకు ఆర్థికంగా మద్దతును పెంచుతామని సంపన్న దేశాలు చేసిన వాగ్దానాలు దీర్ఘకాలికంగా నెరవేరకుండా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..ఢిల్లీలో శుక్రవారం కాంగో ఉప ప్రధాని లియోనార్డ్‌తో సమావేశమైన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్