అంతర్జాతీయం

పాక్‌లో మహా కూటమి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 11: పాకిస్తాన్ మాజీ నియంత పెర్వెజ్ ముషారఫ్ ఇరవై మూడు పార్టీలతో ‘మహాకూటమి’ని ఏర్పాటు చేసినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ‘పాకిస్తాన్ అవామీ ఇత్తేహాద్’ (పిఏఐ) పేరిట ఆవిర్భవించిన ఈ మహాకూటమికి 74 ఏళ్ల ముషారఫ్ నాయకత్వం వహిస్తుండగా, ఇక్బాల్ దార్‌ను సెక్రటరీ జనరల్‌గా నియమించారు. దుబాయ్ నుంచి పాత్రికేయులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాక్ మాజీ అధ్యక్షుడైన ముషారఫ్ మాట్లాడుతూ, ముహజిర్ జాతికి చెందిన పార్టీలన్నీ ఐక్యతను ప్రదర్శించాలన్నారు. ‘ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్’ (ఎంక్యూఎం), పాక్ సరాజమీన్ పార్టీ (పిఎస్పీ)లు కూడా మహాకూటమిలో చేరాలని ఆయన ఆహ్వానించారు. ఈ కూటమి స్వరూప స్వభావాల గురించి ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఇందులోని పార్టీలన్నీ ఒకే పేరుతో పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. ఎంక్యూఎం పార్టీకి తాను నాయకత్వం వహిస్తానని వస్తున్న వార్తల్లో అర్థం లేదని, ఓ చిన్న పార్టీకి తాను పగ్గాలు చేపట్టే ప్రసక్తే లేదన్నారు. ఒకప్పటి పరిస్థితితో పోల్చితే ఎంక్యూఎం ఇపుడు సగభాగం మాత్రమే ఉందని, ఆ పార్టీలో అంతర్గత సమస్యలను నివారించాలన్నదే తన తపన అన్నారు. ఫరూఖ్ సత్తార్, ముస్త్ఫా కమల్ వంటి నేతలను తప్పించాలన్న యోచన కూడా తనకు లేదని, వీరి పార్టీలు తనతో కలవకున్నా పట్టించుకోనన్నారు. ఎంక్యూఎం పార్టీతోపాటు ముహజిర్ వర్గం ప్రజల్లో గౌరవాన్ని కోల్పోయినట్లు ముషారఫ్ అన్నారు. జాతి సంబంధ పార్టీలను ముజాహిర్ వర్గంవారు పరిత్యజించి మహాకూటమిలో చేరాలన్నారు.
పాకిస్తాన్ ముస్లిం లీగ్ నాయకులు చౌదరి షుజాత్, చౌదరి పెర్వెజ్ ఇలాహీ వంటి నేతలు మహకూటమిని బలపరచాలన్నారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఐ ఇన్సాఫ్ (పీటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ కూడా సొంత పార్టీకోసం ఆలోచించడం మానేసి దేశ ప్రయోజనాలకోసం మహాకూటమికి మద్దతునివ్వాలన్నారు. మహాకూటమికి అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పాక్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలగరాదన్నారు. బెనజీర్ భుట్టో హత్య కేసుకు సంబంధించి ఎలాంటి విచారణలనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. దేశ క్షేమంకోసం న్యాయస్థానాలు, సైనికదళాలు పనిచేసే పరిస్థితి ఉండాలన్నారు.