అంతర్జాతీయం

అది ఒక బిజినెస్ ట్రిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హొనోయ్, నవంబర్ 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ పిపాసి అంటూ ఉత్తర కొరియా తీవ్రంగా మండిపడింది. దేశాల మధ్య చిచ్చుపెడుతూ శాంతికి విఘాతం కల్పించడానికి అమెరికా అధ్యక్షుడు టూర్లకు బయలుదేరాడని విరుచుకుపడింది. ఉత్తర కొరియాపై యుద్ధం చేద్దాం రండి అంటూ ప్రపంచ దేశాలను ట్రంప్ రెచ్చగొడుతున్నారని ఉత్తర కొరియా దాడికి దిగింది. ఉత్తర కొరియా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కేసీఎన్‌ఏ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘ట్రంప్ ఆసియా పర్యటన వెనక వ్యాపార ప్రయోజనాలే ఉన్నాయి. అంతే తప్ప ఎపెక్ సభ్య దేశాలను ఉద్ధరించడానికి కాదు’ అని దుమ్మెతిపోశారు. తమపై తరచూ విమర్శలు చేస్తూ ఏకాకిని చేయాలని అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఆసియా పర్యటనకు వచ్చిన ట్రంప్ తమ అణు ప్రయోగాలను అదేపనిగా ఎత్తిచూపుతూ ప్రకటన చేయడం వెనక దురుద్దేశం ఉందని ఆయన అన్నారు. దక్షిణ కొరియా పార్లమెంటును ఉద్దేశించి బుధవారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉత్తర కొరియా తొలిసారి అధికారికంగా ఖండించింది. ‘ట్రంప్ తాటాకు చప్పుళ్లకు భయపడం.. మా అణు ప్రయోగాలు, క్షిపణి పరీక్షలను ఆపబోం’ అని ఆ ప్రతినిధి ప్రకటించారు. ఉత్తర కొరియా భద్రత కోసం వాటిని కొనసాగిస్తామని వెల్లడించారు. ట్రంప్ పర్యటన ఓ బిజినెస్ ట్రిప్‌గా ఆ ప్రతినిధి అభివర్ణించారు. పసిఫిక్ ప్రాంతంలో వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేందుకే ఆయన పర్యటన చేస్తున్నారని అధికార మీడియాలో ధ్వజమెత్తారు. ట్రంప్ పర్యటన వెనక అమెరికాకు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలున్నాయని, మార్కెట్లపై పెత్తనం చేయడానికే మోసపూరిత సబ్సిడీలు ప్రకటిస్తున్నారని ఉత్తర కొరియా ఆరోపించింది. ప్రపంచ మార్కెట్‌పై గుత్త్ధాపత్యం కోసమే కోట్ల రూపాయలు వెచ్చించి ట్రంప్ విదేశీ పర్యటను చేస్తున్నారని పొంగ్యాంగ్ విదేశాంగ ప్రతినిధి దుయ్యబట్టారు. ఇలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వియత్నాంలో ఘన స్వాగతం లభించింది. హొనోయ్‌లో ప్రతినిధులతో ఆదివారం ఉదయం ఆయన సమావేశమవుతారు. మధ్యాహ్నం ఫిలిప్పీన్స్ వెళ్లి ఆసియన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.