అంతర్జాతీయం

ట్రంప్‌తో మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, నవంబర్ 12: ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసియాన్ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విడిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్‌లతో విడివిడిగా సమావేశం అయ్యారు. జపాన్ ప్రధానమంత్రి షింజో అబే, రష్యా ప్రధాన మంత్రి డిమిట్రి మెద్వెదేవ్, మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్‌లతో కూడా ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడటం కనిపించింది. 31వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల నేతలకు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం సందర్భంగా మోదీ ఈ నేతలతో చర్చలు జరిపారు. ఫిలిప్పీన్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే పసాయ్ నగరంలోని ఎస్‌ఎంఎస్ కనె్వన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ విందు సందర్భంగా మోదీ ఇతర నేతలతో కూడా కొద్దిసేపు మాట్లాడారు. మోదీ సహా వివిధ దేశాల నేతలు ఫిలిప్పీన్స్ జాతీయ దుస్తులు అయిన ఎంబ్రాయిడరీతో కూడిన చొక్కా బరోంగ్ టాగలోంగ్‌ను ధరించారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రఖ్యాత డిజైనర్ అల్బెర్ట్ అండ్రాడా ఈ చొక్కాలను డిజైన్ చేశారు. మోదీ వివిధ దేశాల అధినేతలతో తాను కలిసి మాట్లాడిన చిత్రాలను సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మోదీ, ట్రంప్‌ల మధ్య సోమవారం ద్వైపాక్షిక సమావేశం జరుగనున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడితో భారత ప్రధాని ఆదివారం కొద్దిసేపు మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులను మదింపు చేయడం సహా ఉభయ దేశాలకు ప్రయోజనకరమైన అనేక అంశాలపై ఈ ఇద్దరు సోమవారం నాటి ద్వైపాక్షిక సమావేశంలో చర్చలు జరుపుతారని భావిస్తున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ మరింత కీలకపాత్ర పోషించాలని అమెరికా కోరుకుంటోంది. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా మిలిటరీ విస్తరిస్తుండటం, దూకుడుగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆదివారం జరిగిన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలకు చెందిన అధికారుల సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది.

చిత్రం..ఆసియాన్ సదస్సులో ఆదివారం రాత్రి విందుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ,
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్