అంతర్జాతీయం

55 మంది జాలర్లను నిర్బంధించిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, నవంబర్ 12: భారత్‌కు చెందిన 55 మంది జాలర్లను పాకిస్తాన్ నిర్బంధించింది. ఈ మేరకు పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ (పీఎమ్‌ఎస్‌ఏ) వెల్లడించింది. అరేబియా సముద్రంలో పాక్ జలాల్లోకి ప్రవేశించిన 55 మంది జాలర్లను అరెస్టు చేయడంతోపాటు వారికి సంబంధించిన పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పీఎమ్‌ఎస్‌ఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీరంతా బుధవారం నుంచి శనివారం మధ్యలో అరెస్టయ్యారని, వీరిని తదుపరి విచారణ నిమిత్తం డాక్స్ పోలీసులకు స్వాధీనం చేసినట్లు ఆ ప్రతినిధి తెలిపారు. ఈ జాలర్లను జ్యూడియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచిన అనంతరం తదుపరి చర్యలుంటాయని పోలీసు అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో భారత్, పాకిస్తాన్ దేశాలకు సంబంధించి స్పష్టమైన సరిహద్దులు లేకపోవడంతో తరచుగా పాకిస్తాన్‌కు చెందిన మత్స్యకారులను భారత్ నిర్బంధించడం, అలాగే భారత్‌కు చెందినవారిని పాక్ నిర్బంధించడం జరుగుతోంది. ఇలావుండగా గతంలో అరెస్టయిన భారత్ మత్స్యకారులు 68 మంది అక్టోబర్ 29న పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విధంగా డిసెంబర్ 2016 - జనవరి 2017లో 438 మంది మత్స్యకారులను పాకిస్తాన్ ప్రభుత్వం కరాచీలోని మాలిర్ జైలునుంచి విడుదల చేసింది.