అంతర్జాతీయం

మధ్యవర్తిగా వ్యవహరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనోయి, నవంబర్ 12: దక్షిణ చైనా సముద్ర వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తెలిపారు. దక్షిణ చైనా సముద్రంలో అధిక భాగం తనదేనని పేర్కొంటూ చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న, తన సైన్యాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం వియత్నాంలో పర్యటిస్తున్న ట్రంప్ ఆదివారం వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయి క్వాంగ్‌తో జరిపిన భేటీ సందర్భంగా ఈ ప్రతిపాదన చేశారు. దక్షిణ చైనా సముద్రంలో హక్కుల విషయంలో చైనాతో తగాదా పడుతున్న దేశాలలో వియత్నాం కూడా ఉంది. తాను మంచి మధ్యవర్తినని కూడా ట్రంప్ వియత్నాం అధ్యక్షుడికి చెప్పారు.