అంతర్జాతీయం

జింబాబ్వేలో సైనిక తిరుగుబాటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, నవంబర్ 15: దశాబ్దాలుగా జింబాబ్వేపై ఉక్కుపాదం మోపిన అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే అధికార శకానికి తెరపడిందా? దేశాన్ని సైనిక దళాలు బుధవారం హస్తగతం చేసుకున్న నేపథ్యంలో ఈ సంకేతాలు వెలువడుతున్నాయి. దేశ రాజధాని హరారేలోని పార్లమెంటు భవనం ముందు భారీ ఎత్తున సైనిక వాహనాలు మోహరింపు, అదే విధంగా టెలివిజన్‌లో జాతిని ఉద్దేశించి సైనికాధినేతలు మాట్లాడడంతో అసలు జింబాబ్వేలో ఏమవుతుందన్న ఉత్కంఠ చెలరేగింది. అయితే తాము చేసింది సైనిక తిరుగుబాటు కాదని సైనిక దళాలు తొలుత వెల్లడించినప్పటికీ తాజాగా రాబర్ట్ ముగాబే, ఆయన భార్యను తమ కస్టడీలోకి తీసుకున్నామని ప్రకటించడంతో దేశ పాలనావ్యవస్థ సైన్యం చేతిలోకి వెళ్లిపోయినట్టేనని స్పష్టమవుతోంది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక సైనిక దళాలు ప్రభుత్వం టెలివిజన్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఒక్కసారిగా అంశాతి మొదలైంది. ప్రపంచంలోనే అత్యధిక కాలంపాటు జింబాబ్వేను తన ఉక్కుపిడికిలో బిగించిన పాలకుడిగా 93 ఏళ్ల ముగాబే చరిత్ర సృష్టించారు. ఇంతకాలం పాటు ఒక దేశాన్ని తిరుగులేని ఆదిపత్యంతో తన దారిలోనే నడిపించిన ఘనత కూడా జింబాబ్వేదే. 1980లో శే్వతజాతి మైనారిటీ పాలన అంతమై జింబాబ్వే స్వాతంత్య్రాన్ని పొందిన నేపథ్యంలో ముగాబే అధ్యక్ష పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తిరుగులేని అధికారాన్ని చెలాయించారు.
తాజా పరిస్థితులు రాజకీయ సంక్షోభానికి, అనిశ్చితి దారితీసే అవకాశం ఉండడంతో దేశ ప్రజల్లో ఆందోళన మొదలైంది. కనీస అవసరాల కోసం పరిమిత నగదును తీసుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూలు కట్టారు. అలాగే నిత్యావసరాలను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చుకుంటున్నారు. కాగా జాతిని ఉద్దేశించి మాట్లాడిన మేజర్ జనరల్ సిబుసిసోమాయో ‘ముగాబే చుట్టూ ఉన్న నేరగాళ్లపైనే దృష్టిపెట్టాం. దేశంలో త్వరితగతిన సాధారణ పరిస్థితులను పునరుద్ధరిస్తాం’ అని వెల్లడించారు. ప్రస్తుతం తమ నిర్బంధంలో ఉన్న ముగాబే, ఆయన భార్య భద్రతకు ఎలాంటి భయం లేదని అన్నారు. దేశాన్ని తాము వశం చేసుకోవడం లేదని పేర్కొన్న ఆయన గత కొనే్నళ్లుగా దేశంలో సామాజిక, ఆర్థిక దుస్థితికి కారణమవుతున్న వారినే లక్ష్యంగా చేసుకుని తామీ చర్య చేపట్టామన్నారు. వారిని చేజిక్కించుకున్న వెంటనే దేశంలో మామూలు పరిస్థితులు నెలకొంటాయని భరోసా ఇచ్చారు. కాగా దేశ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని అలాగే భద్రతాదళాలు కూడా తాజా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని సైనిక ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, అశాంతిని రగిల్చినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైనిక దళాలను సెలవుల నుంచి వెనక్కు రప్పించామని మాయో తెలిపారు. దేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని, జింబాబ్వేను ఆధుని నమూనా దేశంగామారుస్తామని ఆయన పేర్కొన్నారు. మరోపక్క అమెరికా హరారేలోని తమ దౌత్యకేంద్రాన్ని మూసేసింది. అలాగే బ్రిటన్ ఎంబసీ కూడా తమ పౌరులకు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇలా ఉండగా ముగాబేను కలుసుకోడానికి జింబాబ్వే మంత్రులతో చర్చలు జరపడానికి తాను తన రక్షణమంత్రులు, భద్రతాధికారులను జింబాబ్వే పంపుతున్నట్టు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా వెల్లడించారు. దేశ రాజ్యాంగాన్ని జింబాబ్వే సైన్యం గౌరవిస్తుందని, పరిస్థితులు త్వరితగతిన అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నట్టు జుమా తెలిపారు. కాగా సైనిక చర్యపై ముగాబే సారధ్యంలోని అధికార జానూ-పిఎఫ్ పార్టీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తింది. ఆర్మీ చర్య దేశ ద్రోహమని మండిపడింది.