అంతర్జాతీయం

రోడ్డు ప్రమాదంలో 11 మంది టీచర్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, జూన్ 11: థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చోన్ బరిస్ ముయెంగ్ జిల్లాలో శుక్రవారం ఒక వ్యాను రహదారిపై బోల్తాపడి మంటల్లో చిక్కుకోవడంతో ప్రైవేటు ఎలిమెంటరీ పాఠశాలకు చెందిన 11 మంది టీచర్లు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాను టైరు పేలిపోయి డ్రైవర్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించిందని థాయిలాండ్ హోం శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందగా, వ్యాను డ్రైవర్ సహా నలుగురు గాయపడ్డారని, క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చామని ఆ శాఖ తెలిపింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లను కలిగివున్న దేశాల్లో థాయిలాండ్ రెండో స్థానంలో ఉందని, ప్రతి సంవత్సరం అక్కడ సగటున దాదాపు 24 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో దుర్మురణం పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది.