అంతర్జాతీయం

వర్క్ వీసాలపై పెరిగిన ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 16: అమెరికాలో హెచ్-1బి వీసాపై పనిచేస్తున్న ఉద్యోగుల కనీస వేతనాన్ని 60వేల డాలర్ల నుంచి 90వేల డాలర్లకు పెంచాలని ప్రతిపాదిస్తున్న బిల్లును అమెరికా కాంగ్రెస్‌లోని ఓ కీలక కమిటీ ఆమోదించింది. భారతీయ ఐటీ వృత్తి నిపుణులు ఎక్కువగా తీసుకుంటున్న ఈ వర్క్ వీసాను పొందటానికి బిల్లులో అనేక ఆంక్షలు కూడా విధించారు.
ద కోర్ట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ద ఇంటర్నెట్ సబ్ కమిటీ చైర్మన్ డారెల్ ఇస్సా ప్రతిపాదించిన అమెరికా ప్రజల ఉద్యోగాల పరిరక్షణ, పెంపుదల చట్టం (ద ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్) హెచ్‌ఆర్-170 బిల్లును హౌస్ జ్యుడీషియరీ కమిటీ బుధవారం ఆమోదించింది. తదుపరి చర్యకోసం ఈ బిల్లు పూర్తిస్థాయి హౌస్‌కు వెళ్లనుంది. ఈ బిల్లును సెనేట్ కూడా ఆమోదించవలసి ఉంది. ఆ తరువాతే దానిని అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు పంపిస్తారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన తరువాత ఈ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. అంటే ఈ బిల్లు చట్టరూపం దాల్చడానికి ఇంకా పెద్ద ప్రక్రియ పూర్తి కావలసి ఉంది.
హెచ్-1బి వీసాలుసహా వలస సంస్కరణలకు సంబంధించిన వివిధ అంశాలపై డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన చట్టసభల సభ్యుల మధ్య, వైట్‌హస్‌కు మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తిన విషయం తెలిసిందే. హెచ్-1బి వీసాలపై ఆధారపడిన యాజమాన్యాలు అమెరికా ఉద్యోగి స్థానంలో హెచ్-1బి ఉద్యోగిని నియమించడాన్ని ఈ బిల్లు నిషేధిస్తోంది. హెచ్-1బి వీసాలపై ఆధారపడిన కంపెనీలు, వాటి క్లయింటు కంపెనీలు వాటిలో హెచ్-1బి వీసా ఉద్యోగి పనిచేస్తున్నంత కాలం లేఆఫ్‌లు ప్రకటించడానికి వీలు లేదని ఈ బిల్లు నిర్దేశిస్తోంది.