అంతర్జాతీయం

మా ఆర్థికమంత్రి రాజీనామా చేయలేదు: పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 18: తమ ఆర్థికమంత్రి ఇషాఖ్ దర్ రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. అవినీతి వ్యవహారాలకు సంబంధించి ‘పనామా పత్రాల’లో తన పేరు బయటపడడంతో ఇషాఖ్ పదవి నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ‘జాతీయ జవాబుదారీతనం న్యాయస్థానం’ సెప్టెంబర్ 27న నేరారోపణలు చేసినప్పటికీ ఇషాఖ్ ఆర్థికమంత్రిగా కొనసాగడం పట్ల పాక్‌లోని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. 67 ఏళ్ల ఇషాఖ్ తన పదవికి రాజీనామా చేసినట్లు వివిధ మీడియా చానళ్లతోపాటు జియో టీవీ వార్తలు ప్రసారం చేశాయి. ప్రస్తుతం నెలకొన్న సందిగ్ధతకు తెర దించాలని కోరుతూ ప్రధాని షాహిద్ అబ్బాసీకి ఇషాఖ్ రాజీనామా లేఖను పంపారని మీడియా కథనాలు చెబుతున్నాయి. కాగా, ఇషాఖ్ రాజీనామా చేయలేదని అయితే నిబంధనల ప్రకారం అతని మంత్రిత్వ శాఖను ప్రధానమంత్రి పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అనారోగ్యం లేదా అనివార్య కారణాల వల్ల ఎవరైనా మంత్రి తన బాధ్యతలను నిర్వహించలేనపుడు అతని మంత్రిత్వశాఖలను ప్రధాని చూడడం ఆనవాయితీ అని ప్రధానమంత్రి కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నందున ఇషాఖ్‌ను పదవి నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, వైద్యచికిత్సల పేరుతో ప్రస్తుతం ఇషాఖ్ బ్రిటన్‌లో ఉంటున్నట్లు పాక్ పత్రిక ‘డాన్’ పేర్కొంది.