అంతర్జాతీయం

చైనా రాయబారిగా గౌతమ్ బంబావాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 19: చైనా కొత్త రాయబారిగా గౌతమ్ బంబావాలే సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గౌతమ్ ఇప్పటివరకు పాకిస్తాన్ హైకమిషనర్‌గా పనిచేశారు. అంతకుముందు భూటాన్ రాయబారిగా పనిచేసిన ఆయన 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. చైనాలో భారత రాయబారిగా ఉన్న విజయ్ గోఖలే భారత విదేశాంగ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులు కావడంతో ఆయన స్థానంలో గౌతమ్ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత విదేశాంగ శాఖలో చైనా వ్యవహారాలు చూసిన తెలివైన అధికారిగా పేరు గడించారు. జపాన్, చైనా, దక్షిణ కొరియా, మంగోలియా, ఉత్తర కొరియా తదితర దేశాలతో భారత్ సంబంధాలు పరిపుష్టం చేయడంలో గౌతమ్ కీలకపాత్ర పోషించారు. కాగా, డోక్లామ్, సరిహద్దు వివాదాలతో ఇరు దేశాల సంబంధాల మధ్య 73 రోజుల పాటు ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయేలా అంగీకారానికి రావడం, సంబంధాలను మరింతగా పెంపొందించుకునేలా చర్చల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ దశలో గౌతమ్ బంబావాలేను చైనా రాయబారిగా నియమించడం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదపడుతుందని చెప్పవచ్చు.