అంతర్జాతీయం

బ్రిటన్‌తో బంధం మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 2: వాషింగ్టన్‌లో జరుగుతున్న అణు భద్రత శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు రక్షణ సహకారం, మేక్ ఇన్ ఇండియా, ఇతర కీలకమైన అంశాలపై చర్చించారు. ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో నా సమావేశం ప్రధానంగా రక్షణ సహకారం, మేక్ ఇన్ ఇండియా, ఇతర కీలక అంశాలపై దృష్టిపెట్టింది’ అని మోదీ శనివారం సౌదీ అరేబియాకు బయలుదేరడానికి ముందు చేసిన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు గత ఏడాది మోదీ లండన్ పర్యటనను గుర్తు చేసుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. గత ఏడాది మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య దాదాపు 900 కోట్ల పౌండ్ల విలువైన ఒప్పందాలతో పాటుగా పౌర అణు సహకారంపై కూడా ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. కాగా, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంతో బలోపేతం అయ్యాయని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. రక్షణ రంగంలో సహకారం కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో ముఖ్యంగా రక్షణ రంగంలో బ్రిటన్ భాగస్వామి కావాలని ప్రధాని తెలిపారు. వీసా అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు వికాస్ స్వరూప్ చెప్పారు. గత ఏడాది మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా లండన్ స్టాక్ ఎక్స్‌చేంజిలో రూపాయి బాండ్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ నిర్ణయం చక్కగా ముందుకు సాగుతుండడం పట్ల కామెరాన్ సంతోషం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంతోపాటుగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు స్వరూప్ చెప్పారు. ఐటి కంపెనీలకు టైర్-2 వీసాలను జారీ చేసే అంశాన్ని మోదీ ప్రస్తావించారని, బ్రిటన్‌కు రావడానికి, అక్కడ పని చేయడానికి నైపుణ్యమున్న వృత్తి నిపుణులకు ఎలాంటి సమస్యలుండకూడదని, వలసల సలహా కమిటీ ఈ విషయంలో చేసిన సిఫార్సులు ఒక వ్యతిరేక భావనను కల్పించే ప్రమాదముందని అన్నారు. ఈ సమస్యను పరిశీలిస్తానని కామెరాన్ హామీ ఇచ్చారని స్వరూప్ తెలిపారు.

చిత్రం వాషింగ్టన్‌లో బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో సమావేశమైన నరేంద్ర మోదీ