అంతర్జాతీయం

జయహో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 21: మండలి పెత్తనాన్ని, తన పలుకుబడిని ఉపయోగించి అంతర్జాతీయ న్యాయస్థానంలో పైచేయి సాధించాలన్న బ్రిటన్ కుయుక్తి భారత్ యుక్తి ముందు చిత్తయింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన అంతర్జాతీయ న్యాయస్థానం చివరి న్యాయమూర్తి ఎంపికలో భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఐసీజే న్యాయమూర్తిగా భారత్ నుంచి దల్వీర్ భండారి మరోసారి ఎన్నికై సత్తా చాటారు. సినీ ఫక్కీని తలపించేలా నాయకీయ పరిణామాలతో మధ్య ఈ ఎన్నిక జరిగింది. ఇటు మంటలిలోనూ, అటూ జనరల్ అసెంబ్లీలోనూ భారత్‌కే తిరుగులేని మద్దతు లభించడంతో బ్రిటన్ అభ్యర్థి చివరి క్షణంలో బ్రిటన్ అభ్యర్థి క్రిస్ట్ఫోర్ గ్రీన్‌వుడ్ బరి నుంచి తప్పుకోవడంతో భారత్ విజయం సునాయాసమైంది. 193 ఓట్లు కలిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ నుంచి భండారీ 183 ఓట్లు కైవశం చేసుకున్నారు. అలాగే, భద్రతా మండలిలోని 15 ఓట్లూ సొంతం చేసుకుని రెండోసారి విజయం సాధించారు. వోటింగ్ జరగడానికి గంట ముందు బరిలోంచి తాను తప్పుకుంటున్నట్టు బ్రిటన్ అభ్యర్థి క్రిస్ట్ఫోర్ గ్రీన్‌వుడ్ ఆకస్మిక ప్రకటన చేయడంతో, ప్రపంచ కోర్టులో తొమ్మిదేళ్ల పదవీకాల న్యాయమూర్తి పదవికి రెండోసారి 70ఏళ్ల భండారీ ఎన్నికైనట్టు ప్రకటించారు. భండారీ విజయంతో ప్రపంచంలోని
శక్తివంతమైన దేశాలకు భారత్ సరికొత్త సంకేతాన్ని పంపినట్టయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ఈ విజయంతో బలోపేతమవుతున్న భారత్ ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో తొమ్మిదేళ్ల పదవీకాలంతో సాగే 15మంది న్యాయమూర్తుల బెంచ్‌లో, ప్రతి మూడేళ్లకోసారి ఐదుగురు కొత్త న్యాయమూర్తుల స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తుంటారు. ఈ పదవికి ఎంపికవ్వాలంటే, పోటీ అభ్యర్థి అటు ఐరాస జనరల్ అసెంబ్లీ, ఇటు భద్రతా మండలిలో మెజార్టీ సాధించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ న్యాయస్థానం 1945లో ఆవిర్భవించింది. దేశాలకు అంతర్జాతీయ న్యాయం, వివాదాలకు సంబంధించి సలహాలు ఇస్తూ ఉంటుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిథి సయ్యద్ అక్బరుద్దీన్ సహా అనేక దేశాల శాశ్వత సభ్యులు భండారీని అభినందనలు తెలిపారు. ‘వందేమాతరం. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ విజయపతాక ఎగురవేసింది. జైహింద్’ అంటూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్‌లో భండారీకి అభినందనలు తెలిపారు. జనరల్ అసెంబ్లీలో గత 11 రౌండ్ల ఓటింగ్‌లో భండారీ మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తూ రావడం గమనార్హం. మరో విశేషం ఏమంటే, భండారీ ఎన్నికతో తొలిసారి ప్రపంచ కోర్టులో బ్రిటన్‌కు న్యాయమూర్తి పదవి లేకుండాపోయింది. అంతేకాదు, 15మంది న్యాయమూర్తులు కలిగిన అంతర్జాతీయ కోర్టులో బ్రిటన్‌కు న్యాయమూర్తి అంటూ లేకుండా పోవడం ఇదే మొదటిసారి. అలాగే మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశం శాశ్వత సభ్యత్వం లేని దేశంతో ఓడిపోవడమూ గత 70 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి.