అంతర్జాతీయం

భండారీకి అమెరికా అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 22: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో సభ్యుడిగా భారత్‌కు చెందిన జస్టిస్ దల్వీర్ భండారీ మరోసారి ఎన్నికైనందుకు అమెరికా అభినందనలు తెలిపింది. అయితే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుత వీటో వ్యవస్థలో సంస్కరణలకు మాత్రం అగ్రరాజ్యం విముఖత చూపుతోంది. 15 మంది సభ్యులుండే ఐసీజేలో పదవికోసం బ్రిటన్, భారత్ పోటీ పడిన సంగతి తెలిసిందే. కాగా, అనూహ్యరీతిలో బ్రిటన్ తన అభ్యర్థిని చివరి క్షణంలో పోటీ నుంచి ఉపసంహరించడంతో భండారీ భారీ మెజారిటీతో గెలిచారు. భద్రతా మండలిని విస్తరించాలన్న ప్రతిపాదనలపై తాము ఇప్పటికీ స్థిరమైన ఆలోచనతో ఉన్నామని అమెరికా ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ‘21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా భద్రతా మండలి ఉండాలి.. ఇప్పటి సవాళ్లను దీటుగా ఆ వ్యవస్థ ఉండాలి.. భద్రతా మండలి వీటో విధానంలో మార్పులు, విస్తరణను వ్యతిరేకిస్తాం..’ అని ఆయన స్పష్టం చేశారు. ఐసీజే ఎన్నికలకు సంబంధించి ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి మధ్య విభేదాల దృష్ట్యా వీటోలో మార్పుల యోచనను తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ఐసీజేలో పదవులకు ఎన్నికైన భండారీని, ఇతర సభ్యులకు తాము అభినందిస్తున్నట్లు అమెరికా అధికార ప్రతినిధి తెలిపారు. ఐసీజేలో చివరి సభ్యత్వానికి జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలిలో 11వ రౌండ్ ఓటింగ్ జరగాల్సిన తరుణంలో బ్రిటన్ తరఫున పోటీ పడిన క్రిస్ట్ఫోర్ గ్రీన్‌హుడ్ పోటీ నుంచి తప్పుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, 11వ రౌండ్ ఓటింగ్‌పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. జస్టిస్ భండారీ భద్రతా మండలిలో, జనరల్ అసెంబ్లీలో మెజారిటీ సంపాదించి మరోసారి ఎన్నికయ్యారని వివరించారు.