అంతర్జాతీయం

ఈజిప్ట్‌లో మహోగ్ర నరమేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరో, నవంబర్ 24: ఈజిఫ్ట్‌లో ఉగ్రవాదులు మరోసారి నరమేధం సాగించారు. మసీదులో శుక్రవారం ప్రార్ధనలు చేస్తున్న వారిపై ఉగ్రవాదులు కిరాతకంగా విరుచుకుపడ్డారు. బాంబులు విసిరి, తుపాకులు పేల్చి తమ రక్తదాహం తీర్చుకున్నారు. ఈ దారుణ మారణకాండలో సుమారు 235 మంది ప్రాణాలు కోల్పోగా 109 మందికి పైగా గాయపడ్డారు. మసీదులో ప్రార్థనల తర్వాత బయటకు వస్తున్న భక్తులను లక్ష్యంగా చేసుకుని వారిపై ఈ నరహంతకులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈజిఫ్ట్‌లోని అల్-అరిష్ పట్టణంలోని అల్-రౌదా మసీదులో ఈ మారణ హోమం జరిగిందని అధికారిక వార్తా సంస్థ ‘మెనా’ ప్రకటించింది. గాయపడిన వారిని 50 అంబులెన్స్‌లలో వివిధ ఆస్పత్రులకు తరలిస్తుండగా అంబులెన్స్‌లపైనా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మసీదులోకి చొరబడిన వెంటనే ఉగ్రవాదులు మొదట బాంబులు విసిరారు. దాంతో మసీదులో ప్రార్ధనలకు వచ్చిన వారంతా భయకంపితులై బయటకు పరుగులు తీయడం ప్రారంభించారు. అదే సమయంలో అక్కడే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన నాలుగు వాహనాల్లో పొంచి ఉన్న ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు.
మూడు రోజుల సంతాప దినాలు
మసీదులో కాల్పుల ఘటన గురించి తెలిశాక ఈజిఫ్ట్ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించింది. దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసీ అధ్యక్షతన ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం జరిగింది. ఉగ్రవాదుల మారణకాండ అనంతరం సహాయక చర్యలు, తాజా పరిస్థితులను అబ్దెల్ ఫత్తా ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈజిఫ్ట్‌లోని ఉత్తర సినై ప్రాంతం చాలా కాలంగా ఉగ్రదాడులతో వణుకుతోంది. 2011 జనవరి విప్లవం ఫలితంగా అప్పటి దేశాధ్యక్షుడు హోస్నీ ముబారక్ పదవిని కోల్పోయినప్పటి నుంచి ఉగ్రవాదుల దాడులు నిత్యకృత్యంగా మారాయి. 2013లో దేశాధ్యక్షుడు మొహముద్ మోర్సీని మిలటరీ దళాలు పదవి నుంచి తప్పించాక అతని పాలనకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మోర్సీ పదవీచ్యుతికి గురయ్యాక పోలీసులు, సైనిక దళాలపై ఉగ్రవాదులు దాడులకు అంతులేకుండా పోయింది. గత కొనే్నళ్లలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇంతవరకూ సుమారు 700 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు విస్తృతంగా తనిఖీలు చేస్తూ అనుమానితులను అరెస్టు చేస్తున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈజిఫ్ట్ అనేక ఉగ్రదాడులను ఎదుర్కొంటోంది. గత మే 26న సెంట్రల్ ఈజిఫ్ట్‌లో క్రైస్తవులు వెళుతున్న ఓ బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఏప్రిల్ 9న అలెగ్జాండ్రియా, టాంటా నగరాల్లోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలపై ఆత్మాహుతి దళాలు దాడి చేయగా 46 మంది మరణించారు.
*

మతవ్ఢ్యౌమె తలకెక్కగ
మతి తప్పగ చేష్టలుడిగి మారణహోమం
అతిగా చేయుచు అదియే
మతమని తలచెడు జిహాదు మసిటెపుడో!
*
చిత్రం..ఈజిప్ట్‌లోని అల్-అరీష్ నగరంలోని ఓ వసీదులో శుక్రవారం ప్రార్థన సమయంలో జరిగిన
ఉగ్రవాద దాడి బీభత్స దృశ్యాలివి.