అంతర్జాతీయం

జింబాబ్వే అధ్యక్షుడిగా మ్నన్‌గాగ్వా ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, నవంబర్ 24: ఎమ్మర్సన్ మ్నన్‌గాగ్వా శుక్రవారం జింబాబ్వే కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతవరకు అధ్యక్షుడిగా పనిచేసిన రాబర్ట్ ముగాబేకు వ్యతిరేకంగా సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న తరువాత దేశంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు ఎమ్మర్సన్ ప్రమాణ స్వీకారంతో తెరపడింది. ఇటీవలి వరకు రాబర్ట్ ముగాబేకు అత్యంత సన్నిహితుల్లో ఒకరయిన ఎమ్మర్సన్ హరారే నగర శివార్లలోని నేషనల్ స్పోర్ట్స్ స్టేడియంలో వేలాది మంది మద్దతుదారులు, ఉన్నతాధికారులు, విదేశీ దౌత్యవేత్తల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. భద్రతా బలగాలు స్టేడియం వద్ద, చుట్టుపక్కల గట్టి భద్రతా చర్యలు చేపట్టాయి. ఎమ్మర్సన్ మద్దతుదారుల్లో చాలా మంది ఉత్సాహంతో స్టేడియంలో, చుట్టుపక్కల నృత్యాలు చేశారు. డార్క్ సూట్, ఎరుపు రంగు టై ధరించి, ఛాతీపై పతకాలను వేసుకొని ఎమ్మర్సన్ దేశ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ‘మ్నన్‌గాగ్వా అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నందుకు మేము ఎంతో ఉద్వేగంగా ఉన్నాం. ఆయన నుంచి ఎంతో ఆశిస్తున్నాం. మేము సుదీర్ఘ కాలం పాటు నియంతల పాలనలో ఉన్నాం’ అని 23 ఏళ్ల షరోన్ వౌయకుఫా అన్నారు. ముగాబే గురించి ప్రస్తావిస్తూ, ‘ముగాబే చాలా వృద్ధుడు. ఆయన చేసిన నేరాలకు ఆయనను శిక్షిస్తారని మేము అనుకోవడం లేదు. 93 ఏళ్ల వృద్ధుడిని ఎలా శిక్షిస్తారు? కాని, అతని భార్య, ఇతరులు నేరం చేసి ఉంటే, కేసు నమోదు చేసి విచారించాలి’ అని షరోన్ పేర్కొన్నారు.

చిత్రం..ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తున్న జింబాబ్వే కొత్త అధ్యక్షుడు ఎమ్మర్సన్ మ్నన్‌గాగ్వా