అంతర్జాతీయం

సరుూద్‌ను వెంటనే అరెస్టు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 25: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సరుూద్‌ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయడం తప్పుడు నిర్ణయమని, ఉగ్రవాదంపై పోరులో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని అమెరికా పేర్కొంది. ముంబయి పేలుళ్లకు సూత్రధారి అయిన సరుూద్‌ను వెంటనే అరెస్టు చేయాలని అమెరికా పాక్‌కు తేల్చిచెప్పింది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ తీవ్రంగా పరిగణించాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా వ్యాఖ్యానించింది. ‘లష్కరే తోయిబా నాయకుడు సరుూద్‌ను గృహనిర్బంధం నుంచి పాక్ విడుదల చేయడాన్ని మేం ఖండిస్తున్నాం.. వెంటనే అతడిని అరెస్టు చేసి ప్రాసిక్యూషన్ చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం..’ అని అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’ మీడియా కార్యదర్శి సరా శాండర్స్ పేర్కొన్నారు. సరుూద్‌ను ప్రాసిక్యూట్ చేయడంలో, నేరాభియోగాలను నమోదు చేయడంలో విఫలమైన పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి బదులు తప్పుడు సంకేతాలిస్తోందని పేర్కొన్నారు.
సరుూద్‌పై చట్టపరంగా కఠిన చర్యలను తీసుకోని పక్షంలో ఇతర దేశాలతో పాక్‌కు సంబంధాలు దెబ్బతింటాయని వైట్ హౌస్ హెచ్చరించింది. పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నారని, అయితే మిలిటెంట్లకు పాకిస్తాన్ నిలయంగా మారుతోందని శాండర్స్ తెలిపారు. ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని పాక్ నిరూపించుకోవాలంటే సరుూద్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు.