అంతర్జాతీయం

నేను సైతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్, నవంబర్ 26: మనిషి మేధస్సు నుంచే పుట్టినా, మనిషిని -మర మనిషి ఎప్పుడో దాటిపోయాడు. మానవుడికి అసాధ్యమైన అనేకానేక రంగాల్లో తన కృత్రిమ మేథస్సుతో అద్భుతాలు సాధిస్తున్నాడు. అలాంటి రోబోలు రాజకీయాల వైపూ దృష్టి పెడితే.. న్యూజిలాండ్‌లో అదే జరగబోతోంది. రాజకీయాల్లో నేతల విశ్వసనీయత మీద సవాలక్ష అనుమానాలు ముసురుతున్న తరుణంలో -రాజకీయ కార్యకలాపాలు చక్కదిద్దే రోబోలు రూపుదిద్దుకుంటున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన 49ఏళ్ల వ్యాపారవేత్త నిక్ గెరిస్టెన్ రూపొందించిన రోబో శామ్ ఆ తరహా మర మనిషే. ‘శామ్ చాలా నేర్చుకుంది. రాజకీయంగా నిరంతరం పదునుదేరుతూనే ఉంది. ఫేస్‌బుక్, మెసెంజర్, హోంపేజీల్లో ప్రజల సవాలక్ష ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు చకచకా ఇస్తోంది’ అంటున్నాడు శామ్ సృష్టికర్త నిక్ గెరిస్టెన్.
ఒకవిధంగా చెప్పాలంటే -కృత్రిమ మేథస్సు కలిగిన రాజకీయ నాయకురాలు శామ్. స్థానిక సమస్యల నుంచి పెద్దల సభకు సంబంధించిన విధానపరమైన అంశాలు, విద్య, విదేశీ వ్యవహారాలపై అనర్గళంగా సమాధానాలు ఇవ్వగలుగుతుంది అని నిక్ వెల్లడించాడు. ‘రాజకీయం దారితప్పింది. కుహానాతత్వంతో భ్రష్టుపట్టింది. రాజకీయాల్లో విశ్వసనీయతమీద సవాలక్ష అనుమానాలు ముసురుతున్నాయి. ప్రాథమిక అంశాలపైనే కాదు, సంక్లిష్ట సమస్యలపైనా రాజకీయ నేతలకు సరైన అవగాహన లేకపోవడం, స్వార్థపూరిత ఆలోచనలే ఇందుకు కారణం కావొచ్చు’ అని గెరిస్టెన్ వ్యాఖ్యానించాడు. ఈ విషమ పరిస్థితిని అధిగమించాలంటే రాజకీయాలకు సాంకేతికతను అనుసంధానించి ఆపాదించాల్సిన తరుణం ఆసన్నమైందని శామ్ సృష్టికర్త గెరిస్టెన్ అభిప్రాయపడ్డాడు. దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు రాజకీయ రోబోలతో సాంకేతిక పరిష్కార మార్గాలు అనే్వషిస్తే రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రాంతమేదైనా, ప్రపంచం మొత్తంమీద రాజకీయ వ్యవస్థ నియమ పద్థతిలో లేదని, శామ్‌లాంటి రోబోల సాయంతో రాజకీయంగా, సాంస్కృతికంగా దేశాలు బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని ‘టెక్ ఇన్ ఆసియా’ తన కథనంలో పేర్కొంది. ఎన్నికల గోదాలోకి దిగే అవకాశం రోబోలకు లేకున్నా, 2020నాటికి అంటే న్యూజిలాండ్‌లో సాధారణ ఎన్నికల సమయానికి ఒక అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలకంటే మరింత మెరుగైన స్థితికి శామ్ చేరుకోగలదని గెరిస్టెన్ బలంగా నమ్ముతున్నాడు. ‘న్యాయపరమైన ప్రతిబంధకాలు అధిగమించి శామ్ తన సత్తా చాటుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని సృష్టికర్త గెరిస్టెన్ వెల్లడించాడు.

చిత్రం..నేను రోబోను కాను