అంతర్జాతీయం

చిత్తశుద్ధి లేని పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, నవంబర్ 26: ముంబయిపై జరిగిన భయానక దాడికి కుట్ర జరిపిన వారిని శిక్షించే విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ కూడా చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. పదిమంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న ముంబయిపై దాడి జరిపి 166మందిని బలిగొన్న విషయం తెలిసిందే. ఆ దాడికి సంబంధించి పాక్ కుట్రదారుల ప్రమేయాన్ని రుజువు చేస్తూ భారత్ ఎన్నో సాక్ష్యాధారాలను పాక్‌కు అందించింది. అయినప్పటికీ కూడా పాక్ ధోరణిలో మార్పు రాలేదని ఆ దాడికి కుట్ర పన్నిన హఫీజ్ సరుూద్‌ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడం పాకిస్తాన్ చిత్తశుద్ధి రాహిత్యానికి నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు.