అంతర్జాతీయం

పాక్‌లో ఆగని అల్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 26: వరుసగా రెండోరోజు కూడా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ అల్లర్లతో దద్దరిల్లింది. అతివాద మత సంస్థల కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మరణించారు. 200మందికి పైగా గాయపడ్డారు. గత మూడు వారాలుగా అతివాద మత సంస్థలకు చెందిన కార్యకర్తలు ఇస్లామాబాద్‌కు దారితీసే మార్గాలన్నింటినీ దిగ్బంధం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు, పారా మిలిటరీ దళాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అలాగే రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. అయితే ఈ అణచివేత చర్యలు హింసాత్మకంగా మారడంతో భద్రతా దళాలు వెనక్కి తగ్గాయి. శనివారం జరిగిన దాడుల్లోనే ఆరుగురు మరణించారని, అయితే ఈ దాడుల్లో తొమ్మిదిమంది సీనియర్ అధికారులు తీవ్రంగా గాయపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా శాంతిభద్రతల పరిస్థితి విషమించిన నేపథ్యంలో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం రెండురోజులపాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.