అంతర్జాతీయం

139 మంది సైనికులకు ‘ఉరి’ సరైనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, నవంబర్ 27: ‘బంగ్లాదేశ్ రైఫిల్స్’ (బిడిఆర్)కు చెందిన 139 మంది సైనికులకు మరణశిక్ష, మరో 146 మంది సైనికులకు యావజ్జీవ జైలుశిక్ష విధించాలన్న కింది కోర్టు తీర్పును బంగ్లాదేశ్ హైకోర్టు సమర్థించింది. 2009లో దేశంలో తిరుగుబాటు సందర్భంగా 74 మంది పౌరులను, 57 ఆర్మీ అధికారులను బిడిఆర్ సైనికులు హతమార్చినందుకు ఈ శిక్షలను విధించారు. కింది కోర్టు తీసుకున్న నిర్ణయంపై వాదనలు ముగిశాక హైకోర్టు శిక్షలను ఖరారు చేసింది. ఈ కేసులో 139 మంది సైనికులకు ఉరిశిక్షను, 146 మందికి యావజ్జీవ జైలు శిక్షను హైకోర్టు ఖరారు చేసిందని అటార్నీ జనరల్ మహబూబే ఆలం సోమవారం మీడియాకు తెలిపారు. హైకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చిందని ఆయన వివరించారు. ఢాకాలోని కింది కోర్టు తీర్పు ఇచ్చిన నాలుగేళ్లకు హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. 152 మందికి ఉరిశిక్షను, 158 మందికి యావజ్జీవ జైలుశిక్షను విధించాలని కింది కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. బంగ్లాదేశ్‌లో ఇది అతిపెద్ద క్రిమినల్ కేసు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్ రైఫిల్స్‌లో (ప్రస్తుతం ‘బోర్డు గార్డు బంగ్లాదేశ్-బిజిబి) పనిచేస్తున్న సైనికులు తిరుగుబాటు సందర్భంగా ఎంతోమంది పౌరులను, ఆర్మీ అధికారులను హతమార్చినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ దారుణాలకు సంబంధించి సుమారు 800 మంది పారామిలటరీ సైనికులపై విచారణ జరిపారు.