అంతర్జాతీయం

భారత్ మహాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: భారత్ గొప్ప దేశమని, భారతీయలు స్ఫూర్తిప్రదాతలుగా నిలిచారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, శే్వతసౌధం సలహాదారు ఇవాంక ట్రంప్ పేర్కొన్నారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అన్నారు. కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్న యువతకు ఆమె స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 150 దేశాల ప్రతినిధులకు శుభాకాంక్షలు అని ఇవాంక అనగానే హాలు చప్పట్లతో మార్మోగిపోయింది. భారత అంతరిక్ష విజ్ఞానం చంద్రుడిని దాటి మార్సు వరకూ వెళ్లిందని ఆమె కొనియాడారు. కొత్త ఆవిష్కరణలతో వస్తున్న ఔత్సాహికులు విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని చెప్పారు. ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతోందని పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కాంక్ష వీడకుండా నిరంతరం పనిచేయాలని పేర్కొన్న ఆమె భారత్ అమెరికాకు నిజమైన మిత్రుడని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతుంటారని పేర్కొన్నారు. అందమైన భారతదేశానికి వచ్చేందుకు తమకు ఆహ్వానం అందిందని, ప్రపంచ ప్రఖ్యాత బిరియానీకి హైదరాబాద్ పుట్టినిల్లుని అన్నారు. ముత్యాల నగరంలో యువత గొప్ప సంపద, ఇక్కడ పారిశ్రామికవేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారని అన్నారు. ‘ మీరు రాత్రింబవళ్లు పనిచేసే రోబోలు, యాప్‌లు తయారు చేస్తున్నారు, ఆసియాలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టి- హబ్ తయారైంది..’ అని కొనియాడారు. ఈ సదస్సులో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, జీఈఎస్ సదస్సులో 52 శాతం మంది మహిళలు పాల్గొనడం తనకు గర్వకారణమని చెప్పారు. పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలని తాను తెలుసుకున్నానని అన్నారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య 10 శాతం పెరిగిందని, ఇపుడు అమెరికాలో కోటి 10 లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని , సొంత కాళ్లపై నిలబడేందుకు నిగరంతరం కృషి చేస్తున్న మహిళా పారిశ్రామిక వేత్తలు అందరికీ మార్గదర్శకులని అన్నారు. ఒక్క మహిళ నిలబడితే కుటుంబం, సమాజం, వ్యవస్థలు నిలబడతాయని చెప్పారు. ‘మా నాన్న అధ్యక్షుడు అయిన తర్వాత వ్యాపారాలు అన్నీ వదిలి తాను సహాయ సహకారాలు అందించేందుకు వచ్చాను...’ అని ఇవాంక అన్నారు. గత దశాబ్దంలో నూతన ఉత్పత్తుల రూపకల్పనలో మహిళలు ఎంతో ముందడుగు వేశారన్నారు. ఎంతోమంది మహిళలు ఉత్పాదక రంగంలోకి దూసుకువచ్చారన్నారు. గత దశాబ్దంలో మహిళా పారిశ్రామికవేత్తలు 90 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడులు, సాంకేతికత, సహాయ సహకారాలు అందిస్తే చాలని వారు అందుకుంటారని అన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రసంగిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక సలహాదారు ఇవాంక ట్రంప్.